Covid In Tokyo: టోక్యోలో కరోనా కల్లోలం, అత్యధికంగా ఒక్కరోజే 2,848 కేసులు నమోదు, ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత జపాన్ రాజధానిలో పంజా విప్పిన కోవిడ్, ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్
Coronavirus towns (Photo-ANI)

Tokyo, Jul 27: టోక్యోలో కరోనా పంజా విసిరింది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 2,848 కేసులు జపాన్ రాజధాని టోక్యోలో (Tokyo Reports Highest Single-Day Spike) నమోదయ్యాయి. ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కాగా జపాన్ రాజధానిలో గత జనవరిలో 2520 కేసులు నమోదు కాగా ఈ సారి ఆ రికార్డును తిరగరాస్తూ నిన్న ఒక్కరోజే 2,848 కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో ఆందోళన మొదలయింది.

ఈ కేసులతో టోక్యోలో గతేడాది నుంచి నేటికి కరోనా కేసులు 2 లక్షలు దాటాయి. ఈ కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంటే (Delta Variant During Olympics) కారణమని నిపుణులు సూచిస్తున్నారు.డెల్టా వేరియంట్ పెరుగుదలకు కారణమవుతున్నందున రోగులకు ఎక్కువ పడకలు సిద్ధం చేయాలని అధికారులు ఆసుపత్రులను కోరినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ కేసుల పెరుగుదలతో ప్రధానమంత్రి యోషిహిదే సుగాకు దీని నియంత్రణ అనేది కత్తి మీద సాములా మారింది.

టీవీ కెమెరాల ముందే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్లేయర్‌కి ప్రపోజ్ చేసిన కోచ్, వెంటనే ఒకే చెప్పిన ప్లేయర్, సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్న వీడియో

గత సెప్టెంబరులో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవడం వల్ల కోవిడ్ కేసులు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తాజాగా కేసులు పెరగడంతో ఆయనకు కేసులను నియంత్రించడం అనేది సవాల్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తరుముకొస్తున్న కరోనా థర్డ్ వేవ్, ఆగస్టు నుంచి చిన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు, బీజేపీ ఎంపీల సమావేశంలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ

తాజాగా కేసుల పెరుగుదల ప్రభావం ఒలింపిక్స్‌  మీద పడే సూచలను కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అన్ని దేశాల అథ్లెట్లు, అధికారులు హాజరయ్యారు. దీంతో కేసుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిక్కీ దినపత్రిక నిర్వహించిన సర్వేలో 31% మంది ఆటలను రద్దు చేయాలని లేదా మళ్లీ వాయిదా వేయాలని చెప్పారు.