IPL: 2023లో ఇంటా-బయట మ్యాచ్ లు.. ఐపీఎల్ పై కీలక ప్రకటన చేసిన గంగూలీ.. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ వచ్చే ఆరంభంలోనే ఉంటుందని వెల్లడి

ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరిమిత మైదానాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ ను తిరిగి మునుపటి ఫార్మాట్ లో నిర్వహిస్తామని ప్రకటించారు. 2023 సీజన్ ఐపీఎల్ లో ఇదివరకటిలా ఇంటా, బయట మ్యాచ్ లు జరుగుతాయని చెప్పారు.

Ganguly (File Image)

NewDelhi, September 23: ఐపీఎల్ (IPL) విషయంలో బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Ganguly) కీలక ప్రకటన చేశారు. పురుషులతో పాటు మహిళల ఐపీఎల్ పై తాజా విషయాలను వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరిమిత మైదానాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ ను తిరిగి మునుపటి ఫార్మాట్ (Previous Formate) లో నిర్వహిస్తామని ప్రకటించారు. 2023 సీజన్ ఐపీఎల్ లో ఇదివరకటిలా ఇంటా, బయట మ్యాచ్ లు జరుగుతాయని చెప్పారు. ఇందుకు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ ను పూర్తిగా యూఏఈలో నిర్వహించారు.

కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. టీ20ల్లో వేగంగా 8 వేల మార్కు దాటిన రెండో ఆటగాడి రికార్డు.. విరాట్ ను మూడో స్థానానికి నెట్టిన పాకిస్థాన్ కెప్టెన్.. ఇంగ్లండ్ తో రెండో టీ20లో పాక్ ఘన విజయం

2021 సీజన్ ను సగం భారత్ లో, మిగతా సగాన్ని ఏడారి దేశంలో నిర్వహించారు. ఈ ఏడాది అభిమానుల సమక్షంలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, చెన్నై వేదికల్లో మ్యాచ్‌లు జరిగాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ తమ పాత పద్ధతిలోకి మారనుంది. దీంతో ఎప్పటిలాగే సొంత మైదానం-బయటి మైదానం తరహాలో మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. ఇక, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్ ను వచ్చే ఏడాది ప్రవేశ పెడతామని గంగూలీ వెల్లడించారు. 2023 ఆరంభంలోనే తొలి సీజన్ ను నిర్వహిస్తామని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement