Team India Corona Case: టీమిండియాను పట్టి పీడిస్తున్న కరోనా, భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి కరోనా, ఇప్పటికే ధావన్, గైక్వాడ్, శ్రేయాస్, సైనీ‌కి కరోనా పాజిటివ్

టీమిండియాను కరోనా కేసులు భయపెడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ముందు ఈ కేసులు నమోదవుతుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతేకాదు టీమిండియా ఈ నెల 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టీ20ల సిరీస్‌ని ఆడాల్సి ఉంది.

Axar Patel (Image Credit: Twitter)

అహ్మదాబాద్, ఫిబ్రవరి 4: టీమిండియాను కరోనా కేసులు భయపెడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ముందు ఈ కేసులు నమోదవుతుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతేకాదు టీమిండియా ఈ నెల 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టీ20ల సిరీస్‌ని ఆడాల్సి ఉంది. టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి బుధవారం రాత్రి కరోనా పాజిటివ్‌గా తేలింది. అలానే జట్టులోని సపోర్ట్ స్టాఫ్‌లోనూ నలుగురు ఈ వైరస్ బారినపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు భారత టీ20 జట్టులోని స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

హనీ ట్రాప్‌ వల నుంచి తృటిలో తప్పించుకున్న మంత్రి, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మోడల్‌ను బ్లాక్ మెయిల్ చేయడంతో ఆత్మాహత్యా ప్రయత్నం

గాయం కారణంగా ఇటీవల ముగిసిన భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కి దూరమైన అక్షర్ పటేల్.. భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌లో తప్పకుండా తుది జట్టులో ఉండేలా కనిపించాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో లేకపోవడంతో.. అక్షర్ పటేల్‌కి అవకాశం దక్కింది. కానీ.. కరోనా కారణంగా అతను టీ20 సిరీస్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అక్షర్‌ స్థానంలో ఎవరినీ భారత సెలెక్టర్లు ఇంకా టీ20 జట్టులోకి ఎంపిక చేయలేదు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement