Tilak Varma: సౌతాఫ్రికాతో టీ -20లో చెలరేగిన తెలుగు తేజం, వరుసగా రెండో సెంచరీ, అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు
దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ (Tilak Varma) అదరగొడుతున్నాడు. వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ (Back-to-Back Centuries in T20Is) శతకంతో చెలరేగాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో కేవలం 41 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు.
Johannesburg, NOV 15: దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ (Tilak Varma) అదరగొడుతున్నాడు. వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ (Back-to-Back Centuries in T20Is) శతకంతో చెలరేగాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో కేవలం 41 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు టీ20ల్లో సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. తిలక్ కంటే ముందు సంజూ శాంసన్ ఈ ఘనత అందుకున్నాడు.
Tilak Varma Hits his Second T20I Century
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
2024లో సంజూశాంసన్ – బంగ్లాదేశ్, దక్షిణాప్రికాలపై
2024లో తిలక్ వర్మ – దక్షిణాఫ్రికా పై