Alla Nani Passed Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత.. ఏలూరు నియోజకవర్గంలో తీవ్ర విషాద ఛాయలు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని (ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 57 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నంలోని తన నివాసంలో ఉన్న సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Alla Nani Passed Away: Former AP Deputy CM Dies of Heart Attack

Alla Nani Passed Away: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని (ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 57 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నంలోని తన నివాసంలో ఉన్న సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆళ్ల నాని మృతి వార్త వెలువడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులు, అనుచరులు, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

ఏలూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఆళ్ల నాని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2004లో తొలిసారి ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2009 శాసనసభ ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గ సమస్యలపై స్పందించే నాయకుడిగా ఆయనకు గుర్తింపు లభించింది.

యూకే వీసాల పేరుతో మోసం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్..

తదుపరి రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆళ్ల నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ప్రభుత్వంలో కీలకమైన ఆరోగ్య శాఖను నిర్వహించిన సమయంలో పలు ప్రజారోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు.

ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో వైద్య సదుపాయాల విస్తరణ, ఆసుపత్రుల్లో ఏర్పాట్లు, కరోనా నియంత్రణ చర్యలు, ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. మహమ్మారి సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన నిర్వహించిన బాధ్యతలు రాజకీయంగా కూడా చర్చనీయాంశమయ్యాయి.

2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ (బడేటి చంటి) చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల నాని టీడీపీలో చేరారు.

ఆళ్ల నాని ఆకస్మిక మరణంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏలూరు నియోజకవర్గానికి ఆళ్ల నాని చేసిన సేవలను పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుడిని కోల్పోవడం ఏలూరు ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement