AP Budget 2020-21 Highlights: రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్, రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం, బడ్జెట్‌లోని ప్రధాన అంశాల గురించి తెలుసుకోండి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం (AP CM YS Jagan Mohan Reddy) రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను (AP Budget 2020) ఏపీ ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (FM Buggana Rajendranath Reddy), మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

AP Budget 2020-21 Highlights: రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్, రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం, బడ్జెట్‌లోని ప్రధాన అంశాల గురించి తెలుసుకోండి
AP Finance Minister Buggana Rajendranath Reddy presented AP Budget 2020 in Assembly (Photo-Video Grab)

Amaravati, June 16: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం (AP CM YS Jagan Mohan Reddy) రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను (AP Budget 2020) ఏపీ ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (FM Buggana Rajendranath Reddy), మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏపీలో మూడు రాజధానులకు సై, ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందుతుందని ప్రసంగంలో తెలిపిన గవర్నర్, ప్రసంగాన్ని బహిష్కరించిన టీడీపీ

అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా ఈ బడ్జెట్‌ను (Andhra Pradesh budget 2020-21) రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించి విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సూక్తులతో ముగించారు. గంటన్నరకు పైగా బుగ్గన బడ్జెట్‌ ప్రసంగం సాగింది.

ఏపీ బడ్జెట్‌(2020-21) ప్రధాన అంశాలు

రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌

రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు

మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు

వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు

వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు

ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు

పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు

గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు

హోంశాఖకు రూ.5,988.72 కోట్లు

జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు

పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు

ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు

కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు

పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు

న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు

మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు

ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు

విద్యుత్‌ రంగానికి రూ. 6,984.72 కోట్లు

ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు

సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు

ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు

మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు

ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు

పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు

సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు

ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు

గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు

కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు

ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు రూ.425.93 కోట్లు

104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు

గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు

సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు

రవాణా రంగానికి రూ.6,588 కోట్లు

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోసం రూ. 2100 కోట్లు

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కోసం రూ. 1808.03 కోట్లు

సవరించిన అంచనాలు 2019-20

సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు

మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు

రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు

ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు

ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం​

వివిధ పథకాలు, మౌలిక వసుతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు

వైఎస్సార్‌ లా నేస్తం కోసం రూ. 12. 75 కోట్లు

రైతులకు విత్తనాల పంపిణీ కోసం రూ.200 కోట్లు

జగనన్న విద్యాకానుక కోసం రూ.500 కోట్లు

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం కోసం రూ. 55.15 కోట్లు

కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు

ప్రతిభ స్కాలర్‌షిప్స్‌ కోసం రూ. 10.54 కోట్లు

నేషనల్‌ హార్టీకల్చర్‌ మిషన్‌ రూ. 150.99 కోట్లు

పట్టణ స్వయం సహాయక బృందాల కోసం రూ. 389.89 కోట్లు

రైతులకిచ్చే నష్ట పరిహారం కోసం రూ. 20 కోట్లు

గ్రామ సచివాలయాల కోసం రూ. 1633 కోట్లు

అమరావతి-అనంతపురం నేషనల్‌ హైవే కోసం రూ. 100 కోట్లు

వైఎస్సార్‌ గృహ వసతి కోసం రూ. 3 వేల కోట్లు

డ్రగ్స్‌, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం రూ. 400 కోట్లు

కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం రూ. 242.15 కోట్లు

వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి రూ. 100 కోట్లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.200 కోట్లు

వైఎస్సార్‌‌ సంపూర్ణ పౌషణ పథకానికి రూ.1500 కోట్లు

డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు

జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6వేల కోట్లు

వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు

వైఎస్సార్‌ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు

వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి రూ.275.52 కోట్లు

వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు

జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు

జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు

గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు

రియల్‌ టైం గవర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు

వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు

డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు

వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు

2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగింది

(The above story first appeared on LatestLY on Jun 16, 2020 03:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).