AP capital: high-power-committee-Third-meeting-for-ap-development (File pic)

Amaravati, June 16: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Budget Session 2020) ప్రారంభం అయ్యాయి. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అనూహ్యంగా మూడు రాజధానుల అంశాన్ని (Three Capitals in AP) తీసుకువచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.  ఏపీ బడ్జెట్ ప్రతులకు పూజ చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన, నేడు అసెంబ్లీలోకి బడ్జెట్, ముగిసిన గవర్నర్ ప్రసంగం

ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.

కాగా, ఈ బిల్లును తమకు బలం ఉన్న అసెంబ్లీలో ఆమోదించుకున్న వైఎస్ జగన్ సర్కారు, మండలిలో మాత్రం నెగ్గించుకోలేక పోయిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తన ప్రసంగంలో శాసన ప్రక్రియలో బిల్లు ఉందని వ్యాఖ్యానించారని భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని నెలల్లో మండలిలో సైతం వైసీపీకి బలం పెరుగుతుందని, అప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు.  సీఎం వైయస్ జగన్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు, తొలిసారి ఆన్‌‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌

పరిపాలనకు సంబంధించి త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసనసభ రాజధాని, కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ తో పాటుగా 8 అంశాలకు సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెడుతున్నారు. ఇందులో సీఆర్డిఏ రద్దుకు సంబంధించిన బిల్లు కూడా ఉందని తెలుస్తోంది. గతంలో సిఆర్డిఏ రద్దుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టగా, అసెంబ్లీలో ఆమోదం పొందినా, మండలిలో ఆమోదం పొందకపోవడంతో బిల్లును పక్కన పెట్టారు. కరోనా కల్లోలంలో ఉత్కంఠ రేపుతున్న ఏపీ బడ్జెట్

దాదాపు తొమ్మిది నెలల తరువాత బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టొచ్చు. గతంలో ఆమోదం పొందకపోవడంతో ఇప్పుడు మరలా ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. సిఆర్డీఏ రద్దు చేసి గతంలో చెప్పినట్టుగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లో విపక్షం గొంతు నొక్కేస్తున్నారని, తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఉదయం నల్ల చొక్కాలను ధరించి అసెంబ్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. గడచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడా ఏ పనులూ జరగడం లేదని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ, ఈ ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడుతోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రస్తుత అసెంబ్లీ కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకు మాత్రమే సమావేశమవుతోందని, ప్రజా సమస్యలను చర్చించాలన్న చిత్తశుద్ధి జగన్ సర్కారుకు లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. నేడు సభకు ఇతర టీడీపీ సభ్యులంతా నల్ల చొక్కాలను ధరించే రావడం గమనార్హం.