AP Budget Session 2020: కరోనా కల్లోలంలో ఉత్కంఠ రేపుతున్న ఏపీ బడ్జెట్, మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు, రెండు రోజుల పాటు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
AP Assembly Winter Session 2019 | File Photo

Amaravati, June 16: కరోనా కారణంగా దాదాపు మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బడ్జెట్ సమావేశాలు (AP Budget Session 2020) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చిలో జరగాల్సిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే. రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) బడ్జెట్‌ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ రెండు రోజులకే వాటిని కుదించినట్లుగా తెలుస్తోంది. వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమన్న అత్యున్నత న్యాయస్థానం, విచారణ రెండు వారాల పాటు వాయిదా

సమావేశం ప్రారంభం కాగానే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగం తర్వాత వెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి వెంటనే ఆమోదిస్తారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత సాధారణ, వ్యవసాయ బడ్జెట్లు వరుసగా మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశ పెడతారు.

శాసనమండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు. గతేడాది ప్రభుత్వం 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి మరింత పెద్ద బడ్జెట్ ఉండనున్నట్లు తెలిసింది. ఇందులో సంక్షేమ పథకాలు, నవరత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కర్ణాటకకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్, ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభం, apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం

శాసనసభ, శాసనమండలిలో అడుగడుగునా శానిటైజేషన్‌ చర్యలు చేపట్టారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శాసనసభ ప్రాంగణం, లాబీల్లో రద్దీని బాగా తగ్గించాలని నిర్ణయించారు. కోవిడ్‌ నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో ప్రతి సీటును శానిటైజేషన్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తెలిపారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతరులు ఎవరినీ అనుమతించరాదని నిర్ణయించినట్లు చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. శాసన మండలి ఛైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్‌లు కొరుముట్ల శ్రీనివాసులు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉభయ సభల నిర్వహణ, భద్రత, సభ్యుల ఆరోగ్యం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు, రేపు రానున్న ఫలితం, ఇద్దర్నీ కడప సెంట్రల్‌ జైలుకు తరలించిన అధికారులు, ఫోర్జరీ సంతకాలతో స్కామ్ చేశారని ఆరోపణలు

శాసనసభా సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని మీడియా, పత్రికా ప్రతినిధులు తిలకించేందుకు వీలుగా సచివాలయంలోని మీడియా సెల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని చానెళ్లకు లైవ్‌ ఫీడ్‌ కూడా ఇవ్వనున్నారు. పత్రికా విలేకరుల గ్యాలరీలోకి 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. మీడియా పాయింట్‌ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. మంత్రులు, క్యాబినెట్‌ హోదా ఉన్న వారికి ఇద్దరు సహాయక సిబ్బందిని అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకులు, గన్‌మెన్లకు బయట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బడ్జెట్, పద్దుల వివరాలను పంపిణీ చేసే ఆర్థిక శాఖ సిబ్బంది కూడా త్వరగా పని ముగించుకుని వెళ్లి పోయే విధంగా ఏర్పాట్లు చేసి రద్దీని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు లెజిస్లేచర్‌ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమీప ప్రాంతాల్లోనూ పోలీస్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ సోమవారం సమీక్షించారు. పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. బందోబస్తు కోసం.. గుంటూరుతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిగోదావరి జిల్లాల నుంచి మొత్తం 3,080 మంది పోలీసులు, 105 మంది మార్షల్స్‌ అసెంబ్లీ ప్రాంతానికి చేరుకున్నారు.

గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్‌ ఎస్పీల పర్యవేక్షణలో 17 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలోను, అసెంబ్లీకి వెళ్లే మార్గంలోను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాహనాలకే దారి ఇవ్వనున్నారు. అసెంబ్లీ ప్రాంతంలోను, సమీప ప్రాంతాల్లోను సెక్షన్‌ 144 అమలులోకి తెచ్చారు.

ఈసారి సమావేశాల్లో కీలక అంశాలు :

ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం.

11:30కి బీఏసీ సమావేశం.

బీఏసీ తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, చర్చ, ఆమోదం.

మధ్యాహ్నం 12:30 తర్వాత రెండు సభల్లో బడ్జెట్‌

17న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం... బడ్జెట్‌పై చిన్నగా చర్చ, ఆమోదం.- 18న అసెంబ్లీ ఉండదు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లు ఉంటాయి.

19న రాజ్యసభ ఎన్నికలు... ఫలితాలు