Kadapa, June 15: దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (TDP leader JC Prabhakar Reddy), ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కడప సెంట్రల్ జైలులో (Kadapa Central Prison) రిమాండ్ ఖైదీలుగా ఉంటున్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. కాగా వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలకు ములాఖత్ నిలిపివేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు (BS-III trailer lorries case) పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి (asmith reddy) కడప సెంట్రల్ జైలులో ఉంట్నున్న సంగతి తెలిసిందే. టీడీపీకి మళ్లీ షాక్, పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్, బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించారని ఆరోపణలు
ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను శనివారం అనంతపురం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన అనంతరం వారిని అనంతపురం తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే వీరిని అనంతపురంలోనే జైలుకు తరలించాలని భావించారు.. కానీ అక్కడ కరోనా భయంతో సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో కడప జైలుకు ఇద్దర్ని తరలించారు. రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్ రవికుమార్
కాగా 154 బస్సులు నకిలీ NOC, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బీఎస్ 3 వాహనాల విషయంలో కూడా వీరిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో వారిపై గతంలోనే కేసులు నమోదు చేశారు. 154 వాహనాలకు సంబంధించి అనంతపురం మూలాలతో నేషనల్ వైడ్ స్కామ్ బయటపెట్టామని జేటీసీ అంటున్నారు. ఈ వాహనాలు ఏపీ, నాగాలాండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయని.. ఒకే నకిలీ ఇన్స్యూరెన్స్ పాలసీని నాలుగైదు వాహనాలకు చూపినట్లు రవాణాశాఖ గుర్తించింది. జఠాధర, గోపాల్ రెడ్డి కంపెనీల పేర్లతో అశోక్ లేలాండ్ స్క్రాప్ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి.
జేసీ బ్రదర్స్ కంపెనీ అక్రమంగా 154 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ రద్దు చేసింది. ఈ 95 లారీల్లో 80 లారీలు అనంతపురంలో, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3, గుంటూరులో 2 ఉన్నాయి. ఇంకా ఆరు లారీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది. 154 వాహనాల్లో నాగాలాండ్‌లో 98, ఏపీలో 32, ఇతర రాష్ట్రాల్లో 24 లారీలను జేసీ బ్రదర్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించింది. కాగా బోగస్ పేపర్లలో ఉన్న సంతకాలు, ఎవరి పేర్లు ఉన్నాయో.. అవి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయో వారి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. 154 వాహనాల్లో 101 ఏపీలోనే ఉన్నాయి. తాజాగా వాటిలో 95 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతోపాటు ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశామని సంయుక్త రవాణా కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా నేషనల్ డేటా బేస్డ్‌కు తీసుకోమని కేంద్రంకు మార్చి 18 న లేఖ రాశామని జేటీసీ తెలిపింది . ఇంతవరకు 95 వెహికల్స్ రిజిస్ట్రేషన్ రద్దు చేశామని.. 6 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. 31 వాహనాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాల్సి ఉందని.. నెల్లూరు వారు కొందరు వాహనాలు కొన్నారని చెప్పుకొచ్చారు. వారు ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనలు చేశారని.. ఆయన కొందరితో మాట్లాడి సెటిల్ చేసుకొనే యత్నం చేశారని.. అది ఫలించలేదన్నారు.
కాగా కొద్దిరోజుల క్రితం దివాకర్ ట్రావెల్స్ మేనేజర్ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.