New Delhi, June 15: విషవాయువు లీకేజీ దుర్ఘటనను (Vizag Gas Leak Incident) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకోవడాన్ని, హైకోర్టు (High Court) ప్లాంట్‌ను సీల్ చేయడాన్ని సవాల్ చేస్తూ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల విచారణ వీలైనంత త్వరగా ముగించాలని హైకోర్టుకు సూచిస్తామని తెలిపింది. తమిళనాడులో నాలుగు జిల్లాల్లో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్, జూన్ 19 నుంచి 30 వరకూ అమల్లో.., నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పళని స్వామి సర్కారు ఆదేశాలు
ఎల్జీ పాలిమర్స్ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింన సుప్రీంకోర్టు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.వచ్చే వారం చివరి నాటికి హైపర్ కమిటీ విచారణ ముగించాలంది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం ఉందని ఇప్పటికే ఎన్జీటీ (NGT) స్పష్టం చేసిందని పేర్కొంది. ఎన్జీటీ ఆదేశాలతో డిపాజిట్ చేసిన 50 కోట్ల పంపిణీని 10 రోజులు ఆపాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ప్రధాన ఆదేశాలను సవాలు చేస్తూ అప్లికేషన్ సమర్పించాలని పిటిషనర్‌కు సూచన చేసింది. వైజాగ్‌లో లీకైన గ్యాస్ చరిత్ర ఇదే, దీని పేరు స్టెరిన్ గ్యాస్, 48 గంటల పాటు దీని ప్రభావం, ఈ గ్యాస్ పీల్చితే ఆరోగ్యంపై ప్రభావం ఎంత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ..?
ప్లాంట్‌ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న రోహత్గీ వాదనపై జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఏకీభవించలేదు. ప్లాంట్‌ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని భావించట్లేదని జస్టిస్ తెలిపారు. కంపెనీ లోపం వల్ల గ్యాస్ లీక్ అయిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఇందులో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని స్పష్టం చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.