Chennai, June 15: తమిళనాడులో కోవిడ్-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో మళ్లీ నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ (Tamil Nadu Lockdown) విధించనున్నారు. గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ (Lockdown) అమలు చేయనున్నారు. జూన్ 19 నుంచి 30 వరకూ ఆ నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. ఎమర్జెన్సీ ఐతే తప్ప ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. గత 24 గంటల్లో 325 మంది మృతి, దేశ వ్యాప్తంగా 3,32,424కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నవంబర్ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్న ఐసీఎంఆర్
లాక్‌డౌన్ విధిస్తున్న ఈ నాలుగు జిల్లాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పళని స్వామి సర్కారు నిర్ణయించింది. ఈ సంధర్భంగా పలు సడలింపులను రద్దు చేయనున్నారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకూ నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం ఇస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. 33 శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆరవ దశ లాక్‌డౌన్ లేనట్లే, ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసిన కేజ్రీవాల్, హోంమంత్రి ఆధ్వర్యంలో ముగిసిన అఖిలపక్ష సమావేశం
తమిళనాడులో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,974 పాజిటివ్ కేసులు, 38 మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 44,661కి చేరింది. ఇప్పటివరకు 435 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 24,547 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 19,676 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్నారు.
భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) ప్రతి రోజూ పదకొండు వేల మార్కును దాటుతున్నాయి. . గత 24 గంటల్లో దేశంలో 11,502 కేసులు రికార్డు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 325 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,53,106 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 1,69,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 49 శాతానికి చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య (Coronavirus Death Toll) 9520కి చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 3,32,424కు చేరుకుంది.