New Delhi, June 15: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని (Lockdown Extension Row) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal), లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులతో ఆదివారం సమావేశమైన అమిత్ షా (Amit shah) కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. గత 24 గంటల్లో 325 మంది మృతి, దేశ వ్యాప్తంగా 3,32,424కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నవంబర్ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్న ఐసీఎంఆర్
ఈ అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఉద్దేశం లేదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. అవేమి నమ్మవద్దని అలాంటి ప్రణాళికలేమీ లేవని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 41,000కు పైగా కోవిడ్-19 కేసులు నమోదవగా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Here's ANI Tweet
Many people are speculating whether another lockdown in Delhi is being planned. There are no such plans: Delhi Chief Minister Arvind Kejriwal (file pic) pic.twitter.com/4H9P6492qe
— ANI (@ANI) June 15, 2020
ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలందరికీ కోవిడ్-19 నిర్దారణ పరీక్షలు నిర్వహించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సోమవారం తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రోజుకు 18 వేల మందికి చొప్పున కరోనా పరీక్షలు చేయించనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంతంతో సరిహద్దు కలిగిన ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు)లో కూడా ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
కరోనా కట్టడికై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అమిత్ షా సోమవారం నార్త్ బ్లాక్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ అధికార పక్షం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, బహుజన్‌సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌లో ఇద్దరు భారత దౌత్యాధికారులు మిస్సింగ్, అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన భారత్
ఈ సందర్భంగా.. ప్రజల్లో కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోందని.. రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లందరికీ టెస్టులు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అదే విధంగా కరోనా బాధిత కుటుంబానికి, కంటైన్మెంట్ ఏరియాలో నివసిస్తున్న కుటుంబాలకు రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మెడిసిన్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులను నాన్ పర్మినెంట్ రెసిడెంట్ డాక్టర్లుగా గుర్తించి సేవలు వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.
గుజరాత్‌లో మళ్లీ కఠిన లాక్‌డౌన్ ఉండదు: సీఎం విజయ్ రూపానీ
గుజరాత్‌లో మళ్లీ కఠిన లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందన్న వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కొట్టిపారేశారు. రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రణాళిక ఏదీ తమ ప్రభుత్వం దగ్గర లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని కూడా రూపానీ తోసిపుచ్చారు. వాస్తవ విరుద్ధమైన ఇలాంటి ఊహాగానాలను ప్రజలు నమ్మొద్దని కోరారు.
ఇదిలావుంటే, జూన్ 1 నుంచి నాన్ కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నదని ఆయన ఓ ప్రటకనలో పేర్కొన్నారు. వ్యాపారం, వాణిజ్య సంబంధ కార్యకలాపాలు సైతం పుంజుకుంటున్నాయని వెల్లడించారు. అయితే, కరోనా మహమ్మారిపై పోరాటం కొనసాగుతుందనీ, ప్రజలు కూడా ఈ వైరస్‌తో కలిసి బతకడం నేర్చుకోవాలని రూపానీ సూచించారు.