
Islamabad, June 15: దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) ఇద్దరు భారత దౌత్యాధికారులు అదృశ్యం కావడం (Indian Officials Missing in Pak) కలకలం రేపుతోంది. పాక్ లోని ఇస్లామాబాద్‌లో (Islamabad in Pakistan) గల భారత హై కమిషన్‌లో పనిచేస్తోన్న ఆ ఇద్దరు అధికారులు ఒకేసారి కనపడకుండాపోయారని తెలుసుకున్న భారత్ దీనిపై స్పందింది. అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి వారు ఒక్కసారిగా అదృశ్యమైనట్లు తెలిసింది. ఇటీవలే న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్‌లో ఇద్దరు పాక్ అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దిగ్విజయ్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఫేక్ వీడియో షేర్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ
దీనికి ప్రతీకారంగా పాక్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian High Commission) సిబ్బందిపై ఆ దేశ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల కారులో వెళ్తున్న భారత దౌత్య అధికారిని ఆ దేశ నిఘా వ్యవస్థ ఐఎస్‌ఐకి చెందిన ఒకరు బైక్‌లో వెంబడించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులు అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది.