File image of senior Congress leader Digvijaya Singh (Photo Credits: PTI)

Bhopal, June 15: కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై (Congress leader Digvijaya Singh) పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు(CM Shivraj Singh Chouhan) సంబంధించి ఎడిటెడ్‌ వీడియోను (Fake video) షేర్‌ చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై భోపాల్‌ పోలీసులు సోమవారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరోనా భయంతో ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య, ఢిల్లీలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు

సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై ఒక తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఆయన షేర్‌ చేసినట్లు పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద దిగ్విజయ్‌ సింగ్‌పై కేసు నమోదు చేశారు.

Here's ANI Tweet

లిక్కర్‌కు సంబంధించి మాట్లాడిన పాత వీడియోను ఎడిట్‌ చేసి పోస్ట్‌ చేశారని, వీడియో శివారాజ్‌ సింగ్‌ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని బీజేపీ పేర్కొంది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించాల్సి ఉంది.