Andhra Pradesh CM Jagan Mohan Reddy and Gajendra Singh Shekhawat

Visakha, Nov 2: విశాఖలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1లో 100 పోస్టులు, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీకి ఈ నెల చివరలో నోటిఫికేషన్‌

ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్‌ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు ఇవిగో..

నీటి పారుదల రంగంలో భారత్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది: షెకావత్‌

►ఇరిగేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నాం

►ప్రపంచ దేశాలకు భారత్‌ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోంది

►వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం

►మోదీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం

►రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం

►భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం

►నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్‌ తరాలను ఉపయోగం

►వాటర్‌ రీసైక్లింగ్‌ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం

►తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం

►2019లో మోదీ నేతృత్వంలో జలశక్తి అభియాన్‌ ప్రారంభించాం

►జలశక్తి అభియాన్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి

►నదుల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది

►ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నాం

►డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ల ద్వారా డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది

►అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్‌లను పరిరక్షిస్తున్నాం

►ప్రపంచబ్యాంకు సహకారంతో డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది

నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం: సీఎం జగన్‌

►సదస్సులో పాల్గొన్న దేశ,విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు

►ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది

►ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది

►ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం

►రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది

►వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి

►సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం