AP Budget Session 2020: ఏపీ బడ్జెట్ ప్రతులకు పూజ చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన, నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం, ముగిసిన గవర్నర్ ప్రసంగం
AP FM Buggana Rajendranath performed special prayers in his chamber, before presenting the budget 2020-21 in the state assembly (Photo-ANI)

Amaravati, June 16: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Session 2020) ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ (2020-21) సమావేశాలు సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ (Governor Biswabhusan Harichandan) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలిసారి ఆన్‌‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్‌భవన్‌ (Raj Bhavan) నుంచి గవర్నర్ ప్రసంగం చేశారు. గవర్నర్ మాట్లాడుతూ.. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP cM YS Jagan) నేతృత్వలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు, తొలిసారి ఆన్‌‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌

ఇక ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులకు తన ఛాంబర్ లో పూజలు నిర్వహించారు. గతేడాది ప్రభుత్వం 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి మరింత పెద్ద బడ్జెట్ ఉండనున్నట్లు తెలిసింది. ఇందులో సంక్షేమ పథకాలు, నవరత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Here's ANI Tweet

గవర్నర్ తన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావనను తీసుకువచ్చారు. కర్నూలులో హైకోర్టు, వైజాగ్ కార్యనిర్వాహక రాజధానిగా, అలాగే అమరావతిలో సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని గతంలో వైయస్ జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.