Amaravati, June 16: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Session 2020) ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ (2020-21) సమావేశాలు సందర్భంగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ (Governor Biswabhusan Harichandan) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలిసారి ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్‌భవన్ (Raj Bhavan) నుంచి గవర్నర్ ప్రసంగం చేశారు. గవర్నర్ మాట్లాడుతూ.. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP cM YS Jagan) నేతృత్వలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. కరోనాని కట్టడి చేయడం ఎలా ? రాష్ట్రాల సీఎంలతో మరోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, దేశంలో 3 లక్షల 50 వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు
ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16 శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 8శాతం వృద్ధి రేటు, పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల హామీలో ఇవ్వని 40 పథకాలను సైతం ఏపీ ప్రభుత్వం (AP Govt) విజయవంతగా అమలు చేస్తోందని, ఈ ఏడాదిలో వివిధ పథకాల కింద 3.98 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని గవర్నర్ తెలిపారు. దీని కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం. గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధి సాధించాం. 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చగా, 39 హామీలు పరిశీలనలో ఉన్నాయన్నారు. అలాగే మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద.. మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్దు పథకం కోసం 1105 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కరోనా కల్లోలంలో ఉత్కంఠ రేపుతున్న ఏపీ బడ్జెట్
జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి చేకూరడం కోసం 3857 కోట్లు ఖర్చు చేశాం. అలాగే వైఎస్‌ఆర్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మంది పొందారు. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్‌ఆర్ కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి కోసం 53.85 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. గ్రామ సచివాలయాల్లో 12వేల వైఎస్‌ఆర్ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
ప్రజా ఆరోగ్యంలో భాగంగా 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం. వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం మొదటి దశ పూర్తయింది, రూ.12500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13500లకు పెంచాం. మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ.. రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశాం.’ అని గవర్నర్ అన్నారు.