Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం, బాలికను స్కూలు గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన విద్యార్థి, మా కోరిక కూడా తీర్చాలంటూ మరో నలుగురు వీడియోతో బ్లాక్ మెయిల్
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన మరో నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన మరో నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.
పోలీసుల కథనం మేరకు.. మండవల్లి మండలంలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15న మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ మాటువేసిన సహ విద్యార్థి.. బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. స్కూలులో దారుణం, 17 మంది విద్యార్థినిలకు మత్తు మందు ఇచ్చి దారుణంగా అత్యాచారం చేసిన మేనేజర్స్, కేసు నమోదు చేయని పోలీసులు, ఎమ్మెల్యేని ఆశ్రయించిన బాధితుల తల్లిదండ్రులు
ఆ సంఘటనను బాలసుబ్రహ్మణ్యం(22), చంద్రశేఖర్(22), తేజ(19), హరికృష్ణ(20) వీడియో తీశారు. అనంతరం బాలికకు వీడియో చూపి తమ కోరిక తీర్చాలంటూ బలవంతం చేశారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులనూ బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తామని వారు ప్రాధేయపడినా.. వారు భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు.
దాంతో పాటు వీడియోను వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో.. బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. కైకలూరు గ్రామీణ సీఐ కృష్ణకుమార్, మండవల్లి ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి ఒడిగట్టిన బాలుడిని అదుపులోకి తీసుకొని విజయవాడ జునైల్ హోమ్‌కు తరలించారు. బాధితురాలిని వేధింపులకు గురిచేసిన నలుగురు యువకులను అరెస్టు చేసి కైకలూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ.. న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on May 24, 2024 03:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

