Representational Image (Photo Credits: File Image)

Muzaffarnagar, Dec 7: యూపీలో దారుణ ఘటన (Uttar Pradesh Horror) చోటు చేసుకుంది. 17 మంది విద్యార్థినులకు మత్త ముందు ఇచ్చి ఇద్దరు స్కూలు మేనేజర్స్ అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాలలో పరీక్షల దృష్ట్యా స్పెషల్ క్లాసుల కోసం రాత్రివేళ రమ్మని తెలిపిన మేనేజర్ వారికి భోజనంలో మత్తుమందు (17 girl students drugged, molested) కలిపి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాలో Purkazi areaలో ఓ ప్రైవేటు స్కూల్ నడుపుతున్న స్కూలు మేనేజర్లు నవంబర్ 17న అదే పాఠశాలలో 10వ తరగతి చదివే 17 మంది విద్యార్థినులను ప్రాక్టికల్ ఎగ్జామ్(పరీక్ష) దృష్ట్యా ప్రత్యేక తరగతుల కోసం రాత్రివేళ రమ్మన్నాడు. అలా ప్రత్యేక తరగతుల కోసం వెళ్లిన 17 మంది అమ్మాయిలకు మేనేజర్ భోజనంలో మత్తు మందు కలిపి పెట్టాడు. వారు స్పృహలోలేని సమయంలో వారిపై ఇద్దరు మేనేజర్లు అత్యాచారం చేశారు. ఆ విద్యార్థినులంతా పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో.. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే వారితోపాటు వారి తల్లిదండ్రులను కూడా చంపేస్తానని మేనేజర్ బెదిరించాడు. అయితే ధైర్యం చేసి ఇద్దరు అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో.. వారు పోలీసుల వద్దకు వెళ్లారు.

భర్త, ప్రియుడు, చివరకు ఎస్ఐ యువతిని దారుణంగా., న్యాయం కోసం స్టేషన్‌కు వెళితే పలుచోట్లకు తీసుకువెళ్లి అత్యాచారం చేసిన ఎస్సై, మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు

అయితే ఆ ఉపాధ్యాయుడు వారు ఊరిలో పెద్దమనిషి కావడంతో పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదు. దీంతో బాధితులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్వాల్‌ వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి ఆ కీచక మేనేజర్ని అరెస్టు చేశారు. కానీ అతని స్నేహితుడుఇంకో స్నేహితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. స్థానిక పోలీసులు ముందుగా ఫిర్యాదు చేయనందుకు వారిపై కూడా విచారణ జరుగుతోంది.

ఎమ్మెల్యే ఉత్వాల్ మాట్లాడుతూ... బాధిత బాలిక (Uttar Pradesh Rape Incident) తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ... వారు పట్టించుకోలేదన్నారు. పేద కుటుంబానికి చెందినవారు కాబట్టే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు, ఎస్పీ మాట్లాడుతూ... నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.