Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Chennai, Dec 7: భర్త నుంచి విడాకులు తీసుకుని ప్రియుడుతో కొత్త జీవితం ప్రారంభించిన ఓ యువతిని ప్రియుడు మోసం చేయగా.. న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఆమెకు అక్కడ కూడా పరాభవం ఎదురయింది. మళ్లీ ఎస్ఐ చేతిలో మోసపోయింది.

ఈ దారుణ ఘటన వివరాల్లోకెళితే.. కేరళకు చెందిన ఈ మహిళ ఉద్యోగ రీత్యా కన్యాకుమారి జిల్లాలో నివసిస్తోంది. గతంలో కేరళలోని త్రివేండంలో ఆమె నర్సుగా పనిచేసేది. ఆమెకు అప్పటికే పెళ్లి అయి తొమ్మిదేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత ఆమె భర్త నుంచి విడాకులు తీసుకొని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, ఆ తర్వాత అతడు మోసం చేయడంతో ఫిర్యాదు చేసేందుకు పళుగల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ప్రొఫెసర్‌ కాదు కామాంధుడు, విద్యార్థినుల ముందే ఫ్యాంట్ విప్పి..తాకరాని చోట తాకుతూ.., తమిళ ప్రొఫెసర్‌ సిజె పాల్ చంద్రమోహన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

అక్కడామెకు సాయం చేసే నెపంతో అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ సుందరలింగం (40) బాధితురాలిని పలుచోట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి (who sexually harassed and cheated woman )పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చినట్టు తెలిసి ఓ క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తున్నట్టు నమ్మించి అబార్షన్ చేయించాడు. ఈ ఘటనపై ఆమె పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.

డీఎస్పీ, ఎస్పీలను కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరింది.అయినప్పటికీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో కోర్టును ఆశ్రయించగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన సుందరలింగం, అబార్షన్ చేసిన డాక్టర్ కార్మల్ రాణి (38) సహా 8 మందిపై కేసులు (FIR registered against police sub-inspector) నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.