Trichy, July 8: విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులో సస్పెండ్ అయిన అసోసియేట్ ప్రొఫెసర్‌ను (Tamil Nadu Professor) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ట్రిచీలోని బిషప్ హెబెర్ కాలేజీకి చెందిన తమిళ సాహిత్య విభాగానికి అధిపతిగా ఉన్న సిజె పాల్ చంద్రమోహన్, ఆరోపణలపై (Sexually Harassing Students) దర్యాప్తు చేసిన జిల్లా పరిపాలన యొక్క నిజనిర్ధారణ కమిటీ ఫిర్యాదు మేరకు అరెస్టు (Arrested by Police) చేశారు.
ఐదుగురు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. నివేదికల ప్రకారం, పాల్ చద్రమోహన్ గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పలువురు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు ఆరోపించిన తరువాత, వివాదాస్పద తమిళ ప్రొఫెసర్‌ను బిషప్ హెబెర్ కళాశాల నుండి త్రిచి పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కొద్ది రోజుల ముందు, తిరుచిరపల్లిలోని బిషప్ హెబెర్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థునిలు తమిళ శాఖ అధిపతి పాల్ చంద్రమోహన్‌పై లైంగిక దుష్ప్రవర్తనకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
ట్రిచీలోని బిషప్ హెబెర్ కాలేజీని తిరుచిరపల్లి - చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క తంజావూర్ డియోసెస్ స్థాపించారు. వారే నిర్వహిస్తున్నారు. ఐదుగురు విద్యార్థునిలు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఇచ్చిన ఐదు పేజీల లేఖ ఫిర్యాదులో... పాల్ చంద్రమోహన్ తమ దగ్గర కూర్చుని లైంగిక పరమైన జోకులు వేస్తూ తాకరాని చోట తాకుతూ తమను రోజూ లైంగికంగా వేధించారని చెప్పారు.
Here's ANI tweet
Tamil Nadu | Bishop Heber College Professor C.J.Paul Chandramohan arrested by police on charges of sexual harassment: Trichy City Police
— ANI (@ANI) July 7, 2021
తరగతి సమయంలో, అతను అమ్మాయిలతో చాలా దగ్గరగా కూర్చుని అసభ్యకరమైన భాష మరియు డబుల్ మీనింగ్ లైంగిక సంభాషణలను ఉపయోగిస్తాడు, మిగతా విద్యార్థులు అతనిని అనుసరిస్తారు. అతను చొక్కా మరియు ప్యాంటును విప్పి చూపరానిది విద్యార్థినులకు చూపుతూ అసౌకర్యానికి గురిచేస్తాడు ”అని ఫిర్యాదు లేఖలో తెలిపారు.
దీంతో పాటు పాల్ చంద్రమోహన్ తమపై కాళ్లు వేసి రుద్దడం వంటి వివిధ రకాల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత విద్యార్థినులు ఆరోపించారు. ఉద్యానవనాలలో సన్నిహితంగా ఉండే ప్రేమికులకు ఎలాంటి అనుభవాల ఎదరవుతాయో ముందుగా మీకు ‘నేర్పుతాను’ అని కూడా ఆయన చెప్పేవాడని తెలిపారు.
ప్రొఫెసర్ పాల్ చంద్రమోహన్ కళాశాల ప్రాంగణంలోని తన ప్రైవేట్ గదిని సందర్శించమని బలవంతం చేస్తాడని విద్యార్థులు ఆరోపించారు. పాల్ చంద్రమోహన్ ను లైంగిక వేధింపులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నలిని సహాయం చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. తమిళ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నలిని తరచుగా తన గదిలో ఉన్న విభాగాధిపతిని సందర్శించే ముందు ముఖం కడుక్కుని మేకప్ వేసుకోవాలని బలవంతం చేశారని లేఖలో పేర్కొన్నారు.
లైంగిక వేధింపుల ఫిర్యాదు తరువాత, కళాశాల న్యాయవాది జయంతిరాణి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఫలితంగా కళాశాల అధికారులు పాల్ చంద్రమోహన్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఆరోపణలపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. కాగా తమిళ క్రైస్తవ సాహిత్యంలో పీహెచ్‌డీ చేసిన పాల్ చంద్రమోహన్ కళాశాలలో 20 ఏళ్లుగా సేవలందించారు.
అరెస్టు తరువాత, చంద్రమోహన్ ను పోలీసులు ప్రశ్నించారు. తరువాత జిల్లా కోర్టులో హాజరుపరిచారు, అతన్ని న్యాయ కస్టడీలో రిమాండ్ చేశారు. ప్రముఖ సంస్థల ప్రొఫెసర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో తమిళనాడు ఇటీవల సంచలనం సృష్టించింది.