Nagaland: అసలేం జరిగింది..ఐస్ క్రీం తిని అత్త మృతి, తరువాత రోజు అల్లుడు హోటల్‌లో మృతి, మిస్టరీగా మారిన అత్త రోసీ సంగ్మా, అల్లుడు శామ్యూల్ సంగ్మా మరణాలు, కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ, గురుగ్రామ్‌ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
Representational Image (Photo Credits: File Image)

New Delhi, July 5: గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఐస్‌క్రీం తిని 29 ఏళ్ల రోజీ సంగ్మా మరణించిన (Rosy Sangma Died at a Private Hospital) తర్వాత రోజు, ఆమె మేనల్లుడు శామ్యూల్ సంగ్మా ఒక హోటల్‌లో (Samuel Sangma Found Dead in hotel) విగత జీవిగా కనిపించాడు. అతని మరణం ఆత్మహత్యగా కనబడుతోందని పోలీసులు తెలిపారు.

వీరిద్దరి మృతి పట్ల సోషల్‌ మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతుండటంతో మేఘాలయ రాష్ట్రం తురా పార్లమెంట్‌ సభ్యుడు అగాథ సంగ్మా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వం శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ పోలీసులు, గురుగ్రామ్‌ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Gurugram crime branch) దర్యాప్తు చేస్తున్నారు.

మిస్టరీ డెత్ ఘటన (Mysterious Deaths in Nagaland) వివరాల్లోకెళితే.. నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు చెందిన శామ్యూల్ సంగ్మా, తన అత్త ఎయిర్ హోస్టెస్‌ అయిన రోసీ సంగ్మాతో కలిసి ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో అద్దెకు నివసిస్తున్నాడు. జూన్ 23 రాత్రి, రోసీకి హఠాత్తుగా ఆమె చేతులు మరియు కాళ్ళలో తీవ్రమైన నొప్పి మరియు అధిక రక్తస్రావంతో అనారోగ్యానికి గురయింది. అల్లుడు శామ్యూల్ తన అత్తను ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరుసటి రోజు ఉదయం అనగా జూన్‌ 24 ఉదయం, రోసిని గురుగ్రామ్‌ సెక్టార్‌ 10లోని ఆల్ఫా హాస్పిటల్‌కు తరలించారు.

సాయం చేయమన్న విద్యార్థి, ముఖం పగలకొడతానన్న ఎమ్మెల్యే, ఆడియో సంభాషణ వైరల్ కావడంతో ఫేస్ బుక్ వేదికగా క్లిప్‌పై వివరణ ఇచ్చిన మళయాల నటుడు, కొల్లాం ఎమ్మెల్యే ముఖేష్

శామ్యూల్ తెలిపిన వివరాల ప్రకారం, ఆల్ఫా ఆస్పత్రి ఐసీయూలో చేర్చిన తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది. అప్పుడు, రోసీ వైద్యుల సమక్షంలో ఆసుపత్రి ఐసియులో ఐస్ క్రీం తిన్నారని ఆయన ఆరోపించారు. దీని తరువాత, ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కాసేటికే ఆమె (Woman dies after eating ice-cream) మరణించింది. అయితే ఆ సమయంలో రోసి ఎదురుగా డాక్టర్లు ఉన్నారని.. కానీ ఆమెను ఐస్ క్రీం తినవద్దని వారించలేదని ఆరోపించాడు. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడయి.. మరణించిందని తెలిపాడు సామువేల్‌. దీని గురించి ప్రశ్నించిన తనను ఆల్ఫా ఆస్పత్రి సిబ్బంది కిందపడేసి చితకబాదారన్నాడు.

Here's ANI Update

రోసి చనిపోయిన విధానం తెలియజేస్తూ సామువేల్‌ వీడియో రూపొందించి, న్యాయం చేయాల్సిందిగా కోరుతూ.. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ మరుసటి రోజే ఓ హోటల్‌ రూంలో సామువేల్‌ మృతదేహం (nephew found dead in hotel) వెలుగు చూడటం కలకలం రేపింది. సామువేల్‌, రోసిల మృతిపై సోషల్‌ మీడియాలో నెటిజనులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆ సాఫ్ట్‌వేర్ హిజ్రా, ఆడగొంతుతో నిరుద్యోగులతో మాటలు కలిపి రూ.15.12 లక్షలు కాజేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన అమలాపురం పోలీసులు

సామువేల్‌ మృతి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకుని శామ్యూల్ చనిపోయినట్లు తెలిపారు.శామ్యూల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతని ముఖం మరియు శరీరంపై గాయాల గుర్తులు మరియు వాపు గురించి ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

షాకింగ్..కొడుకు మాజీ భార్యతో కాపురం పెట్టిన తండ్రి, విషయం తెలిసి అవాక్కయిన కొడుకు, రెండో భర్తతో సంతోషంగా ఉన్నానని తెలిపిన కొడుకు మాజీ భార్య, పోలీసుల దగ్గరకు చేరిన పంచాయితీ, యూపీ బదౌన్‌ జిల్లాలో ఘటన

ఈ క్రమంలో ఆల్ఫా హాస్పిటల్‌ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. తమ ఆస్పత్రికి వచ్చాక రోసి ఆరోగ్యం మెరుగైందని.. ఈ క్రమంలో ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్‌ ఐస్‌క్రీం తినడం చూసిన రోసి.. తనకు కూడా కావాలని అడిగిందని తెలిపారు. రోసి తన ఇష్టప్రకారమే ఐస్‌ క్రీం తిన్నదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఇక సామువేల్‌పై తాము దాడి చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై శామ్యూల్‌ ​తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చనిపోయేంత పిరికివాడు కాదు. రోసికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. చనిపోయే రోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నాకు కాల్‌ చేసి మాట్లాడాడు. మరికాసేటికే చనిపోయాడని తెలిసింది. తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది’’ అన్నాడు.