
Amaravati, July 5: ఆడ పిల్లలా మాట్లాడుతూ నిరుద్యోగుల నుండి ఉద్యోగాలు ఇప్తిస్తానని నమ్మబలికి రూ.15.12 లక్షలు మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ట్విస్ట్ ఏమిటంటే అతను హిజ్రా కావడంతో అచ్చం ఆడగొంతులా అతని వాయిస్ ఉండటం. అమలాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నెల్లూరుకు చెందిన నకరికంటి శివదినేష్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా (software engineer) ఉద్యోగం చేస్తున్నారు. అయితే అతను హిజ్రా కావడంతో వాయిస్ కూడా ఆడవారిలా మార్చుకున్నాడు.
ఇతను రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఫోన్ నంబర్లు సేకరించి..వారికి ఉద్యోగాలిప్పిస్తానని తన వాయిస్ ద్వారా అందర్నీ నమ్మించాడు. నిజంగా ఉద్యోగాలు వస్తాయని నమ్మిన నిరుద్యోగులు అతని వలలో పడిపోయారు. అమలాపురం పట్టణం, అంబాజీపేట ప్రాంతాలకు చెందిన ఆరుగురు నిరుద్యోగులు బుట్టలో పడ్డారు. ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న ఆశతో వారు రూ.15.12 లక్షలు (swindled Rs 15 lakh From Unemployed) ఆన్‌లైన్ ద్వారా చెల్లించారు.
అమలాపురంలో అన్నదమ్ములైన ఇద్దరు నిరుద్యోగుల నుంచి రూ.6.70 లక్షలు, అంబాజీపేటకు చెందిన నలుగురు నిరుద్యోగుల నుంచి రూ.8.42 లక్షలు ఉద్యోగాల ఆశ చూపి దండుకున్నాడు. తరచూ ఫోన్లు చేస్తూ ఆన్‌లైన్‌లో డబ్బులు వేయించుకుని ఉద్యోగాలు ఎంతకీ ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన బాధిత నిరుద్యోగులు అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో (Amalapuram police) ఫిర్యాదులు చేశారు. పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్ ఆధ్వర్యంలో ఎస్సై ఎం.ఏసుబాబు తమదైన శైలిలో దర్యాప్తు మొదలు పెట్టారు.
నిందితుడు పని చేస్తున్నానని చెప్పిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. అతని బ్యాంక్ అకౌంట్ చిరునామా ద్వారా అతడు ఆడ గొంతుతో తమను బురిడీ కొట్టించాడని బాధితులు పోలీసులకు తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకూ అవుతుందని అతడు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ బృందంగా నెల్లూరు వెళ్లి నిందితుడు శివ దినేష్‌ను అదుపులోకి తీసుకుని అమలాపురానికి తీసుకొచ్చారు. అతడిని అరెస్ట్ చేసి కోర్డులో హాజరు పరిచినట్లు ఎస్సై ఏసుబాబు తెలిపారు.