Andhra Pradesh Elections 2024: ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ బాసూ, ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఈసీ, మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు

ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసా​యిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్‌ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది

AP Voters List (Photo/File Image)

AP Voter List: ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసా​యిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్‌ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి జిల్లాలో రాజకీయ పార్టీలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఏపీలో మొత్తం ఓటర్లు 4,01,53,292 మంది ఉండగా ఇందులో పురుషులు 1,98,31,791, మహిళలు 2,03,85,851 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, ఆనాటి ప్రధాని నెహ్రూ పెట్టిన కండిషన్ ఏమిటీ ? నవంబర్ 1 నుంచి నేటి వరకు ఏం జరిగింది..

జాబితా ఇదే..

మొత్తం ఓటర్లు- 4,01,53,292

పురుషులు- 1,98,31,791

మహిళలు - 2,03,85,851

ట్రాన్స్ జెండర్లు - 3808

సర్వీస్ ఓటర్లు- 66,158

ఇక, 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది. 1,57,939 ఇళ్లలో 10 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్టు తేలిందని చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement