CoronaVirus Health Bulletin: 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే 104కి కాల్ చేయండి, భయపడాల్సిన అవసరం లేదు: రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి

కోవిడ్‌-19 వైరస్‌ (COVID-19) నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి (Dr. KS Jawahar Reddy) అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడూతూ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని (CoronaVirus) అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.

CoronaVirus Health Bulletin: 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే 104కి కాల్ చేయండి, భయపడాల్సిన అవసరం లేదు: రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి
ap-government-releases-coronavirus-health-bulletin-says-not-to-believe-rumours (Photo-Facebook)

Amaravati,Mar 18: కోవిడ్‌-19 వైరస్‌ (COVID-19) నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి (Dr. KS Jawahar Reddy) అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడూతూ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని (CoronaVirus) అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.

తెలంగాణలో 5కు పెరిగిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ బుధవారం బులెటిన్‌ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో (SPSR Nellore) కోవిడ్ -19 పాజిటివ్‌ బాధితుడు కోలుకుంటున్నాడని, 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లలో ఉండాలని చెప్పామని, వారి కోసం హోమ్‌ ఐసోలేటెడ్‌ చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.ఇప్పటివరకు 7వేల మంది తెలుగువారు విదేశాల నుంచి ఏపీకి వచ్చారని జవహర్ రెడ్డి వెల్లడించారు.

ఇటలీ, స్పెయిన్‌, ఇరాక్‌, సౌత్‌ కొరియా, జపాన్‌ నుంచి వచ్చిన వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారి వివరాల కోసం గ్రామస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నామన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌, పీహెచ్‌సీ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. విదేశాలనుండి వచ్చిన వారిని 14 రోజులు క్వారెంటైన్‌ ఫెసిలీటీస్‌లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తెలిసిన తరువాతే ఇళ్లకు పంపుతున్నామని చెప్పారు. ఎరికైనా కరోనా లక్షణాలు కనబడితే 104కు కాల్‌ చేయమని సూచించారు.

అసలైన సవాల్ ఇదే, సేఫ్‌హ్యాండ్స్ ఛాలెంజ్‌ని విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా విజృంభిస్తున్న నేపథ్యలో సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని, అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మాస్కులు, శానిటైజర్ల కొరత లేదని, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని లేదా వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని చెప్పారు.

వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని, ఈ వైరస్‌ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 856 మంది ప్రయాణికుల్ని గుర్తించామన్నారు. వారిలో 586 మంది ఇళ్లలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని, 20 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

కరోనా కట్టడిలో కీలకమలుపు

ఇక 102 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 90 మందికి నెగటివ్ వచ్చిందని చెప్పారు. మరో 11 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కోవిడ్‌-19 ప్రభావిత దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా 14రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకూడదన్నారు. అంతేగాక కుటుంబ సభ్యులను కానీ, ఇతరులను కానీ కలవకూడదని, 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

భారత్‌లో మూడో కరోనావైరస్ మరణం నమోదు

కొవిడ్-19ను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అంటు వ్యాధుల చట్టం-1897లోని 2,3,4 సెక్షన్లను అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఏదైనా ప్రాంతానికి రాకపోకల్ని నియంత్రించే అధికారం జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

(The above story first appeared on LatestLY on Mar 18, 2020 11:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).