Hyderabad, March 18: ఇండోనేసియా నుంచి దిల్లీ మీదుగా కరీంనగర్ వచ్చిన ఓ 52 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసులు (COVID 19 in Telangana) కు చేరాయి. బాధితుడు గత మూడు రోజులుగా జ్వరం, దగ్గు మరియు శ్వాసలేమితో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తి మరో 11 మందితో కలిసి వచ్చినట్లుగా తెలిసింది, ఇతడికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలటంతో ఇతడితో పాటు ఉన్న మరికొంత మంది గాంధీకి పరుగులు పెట్టారు, మిగాతా వారెవరూ అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీంతో ఇతడితో పాటు ప్రయాణించిన వారి వివరాలను పరిశీలించాల్సిందిగా కేంద్ర ఆరోగ్యశాఖకు అధికారులు సమాచారం ఇచ్చారు.
కరోనా పాజిటివ్ కేసుల కంటే, రోగులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం, వారందరినీ 'క్వారైంటైన్' లో ఉంచడం అధికారులకు తలకు మించిన భారం అవుతుంది. హైదరాబాద్ నుండి దుబాయ్ ప్రయాణ చరిత్ర కలిగిన మొదటి COVID-19 పాజిటివ్ రోగికి 88 మందితో సన్నిహితంగా మెలిగాడు, రెండవ కేసు ఇటలీకి ప్రయాణ చరిత్ర కలిగిన 24 ఏళ్ల అమ్మాయికి 42 సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మూడవది నెదర్లాండ్స్ ప్రయాణ చరిత్ర కలిగిన అతని సన్నిహితులుగా వచ్చిన వారు 69 మంది వ్యక్తులు ఉండగా, హైదరాబాద్ నుండి స్కాట్లాండ్ ప్రయాణ చరిత్ర కలిగిన 4వ పాజిటివ్ రోగికి 11 సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా 5వ కేసులో రోగి 11 మంది బృందంతో కలిసి రైలు ప్రయాణం చేసినట్లు తెలిసింది. వీరందరినీ గుర్తించడం ఇప్పుడు కష్టసాధ్యంగా మారింది.
ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభిస్తుంది. బుధవారం నాటికి ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. మంగళవారం 63 ఏళ్ల వ్యక్తి కూడా కరోనావైరస్ బారినపడి ముంబై ఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది.