Crime Case in AP: హత్యకేసును తారుమారు చేసే యత్నంలో లంచావతారాలైన సీఐ, ఎస్సై.. గుట్టు రట్టు చేసిన శునకాలు.. ఒక కేసును పరిష్కరించబోతే, బయటపడ్డ మరో కేసు.. దాని అంతు చూద్దామంటే మరో విషయం బయటకు.. ఏపీలో మిస్టరీ థ్రిల్లింగ్ క్రైమ్ కేసు..

ఒక కేసును పరిష్కరిద్దాం అనుకున్న పోలీసుల ప్రయత్నంలో మరో హత్య కేసు వెలుగుచూసింది. ఏపీలో మిస్టరీ థ్రిల్లింగ్ క్రైమ్ కేసు

Dog (Representational Image: Credits Google)

Vijayawada, October 15: ఓ హత్యకేసును తారుమారు చేసి కప్పిపుచ్చేందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న ఓ సీఐ (CI), ఎస్సై (SI)లను శునకాలు పట్టించాయి. ఒక కేసును (Case) పరిష్కరిద్దాం అనుకున్న పోలీసుల (Police) ప్రయత్నంలో మరో హత్య కేసు వెలుగుచూసింది. ఏపీలో(AP) మిస్టరీ థ్రిల్లింగ్ క్రైమ్ కేసు వివరాలను ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ ఏడాది జులై 26న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఆళ్లవారిపాలెంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తేలింది. ఈ కేసులో ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు తేలింది.

‘ఛీ..ఛీ.. బాలకృష్ణ అంటేనే రోత పుడుతోంది.. అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోంది. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉంది’.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు

ఈ విషయం వెలుగులోకి వస్తే తమ కుటుంబ పరువు పోతుందని భావించిన శ్రీకాంత్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన జొన్నల నరేంద్రరెడ్డిని ఆశ్రయించాడు. విషయం విన్న ఆయన రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని చెప్పి ఆ మేరకు డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం పమిడిముక్కల సీఐ మేడికొండ ముక్తేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్సై యాదగిరి అర్జున్‌ను సంప్రదించారు. కేసును తారుమారు చేసేందుకు సీఐకి రూ.12.50 లక్షలు, ఎస్సైకి రూ. 1.60 లక్షలు ముట్టజెప్పారు. దీంతో శ్రీనివాసరెడ్డి హత్య కేసులో ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చకుండా సీఐ తప్పించే ప్రయత్నం చేశారు.

‘బాబూ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇంటికి రా..’, ‘డబ్బులు లేవండి’, ‘పర్లేదు.. చార్జీలకు రూ.200 గూగుల్ పే చేశాం.. రా’, యువకుడిని ఇంటికి రప్పించి మరీ హత్య.. అనంతరం మృతదేహం నాలాలోకి.. హైదరాబాద్ లో గగుర్పొడుస్తున్న పరువు హత్య..

ఈ డీల్ గురించి తెలుసుకున్న తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలేనికి చెందిన అధికారపార్టీ నేత పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి.. తానైతే ఇంతకంటే తక్కువకే డీల్ కుదిర్చేవాడినని ఆళ్ల కుటుంబానికి చెప్పారు. మరోవైపు, తోట్లవల్లూరు మండలంలో పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి, నరేంద్రరెడ్డికి మధ్య మధ్యవర్తిత్వం కేసుల్లో గొడవ నడుస్తోంది. దీంతో శ్రీనివాసరెడ్డిని అడ్డు తొలగించుకోవాలని నరేంద్ర ప్లాన్ వేశాడు. డీల్ గురించి మాట్లాడుకుందామని పిలిపించి హత్య చేశాడు. అనంతరం శవాన్ని తీసుకెళ్లి ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లిపర్రు వద్ద పూడ్చేశారు. దీంతో పని పూర్తయిందని భావించాడు. అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

న‌వంబ‌ర్ 12న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఒకే విడ‌త‌లో పోలింగ్‌, డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల

శ్రీనివాసరెడ్డి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు గత నెల 23న తోట్లవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, పాతిపెట్టిన శ్రీనివాసరెడ్డి శవాన్ని శునకాలు పీక్కుని తింటుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత జరిపిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య, నిందితులను రక్షించే ప్రయత్నం, ఈ క్రమంలో సీఐ, ఎస్సైలు లంచం తీసుకున్న విషయాలు బయటపడ్డాయి. పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి హత్యకేసులో నరేంద్రరెడ్డిని గత నెల 27న అరెస్ట్ చేసిన పోలీసులు.. నిన్న సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సై అర్జున్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య