Girl students of BC Gurukul in Keesara bitten by rats

Hyd, Dec 17: కీసరలోని మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల(సనత్‌నగర్, కూకట్‌పల్లి) పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను, ఖమ్మంలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థినిని ఎలుకలు కరిచాయి.కీసరలోని గురుకులంలో ఆదివారం రాత్రి నిద్రపోయిన తర్వాత తమ చేతి వేళ్లను కరిచినట్టు విద్యార్థినులు తెలిపారు. పాఠశాల సిబ్బంది సోమవారం ఉదయం విద్యార్థినులను కీసరలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడిని తీవ్రంగా కరిచిన పిట్‌బుల్ డాగ్, స్థానికులు తరిమినా వదలకుండా.. 

ఇక ఖమ్మం జిల్లా దారవాయిగూడెం బాలికల గురుకులంలో పదో తరగతి చదువుతున్న కీర్తిని ఎలుక కరిచింది. ఈ ఘటనలో ఆమె కాలు, చేయి చచ్చుబడిపోయాయి. పలుమార్లు ఎలుక కరవడంతో ఉపాధ్యాయులు ఆమెకు రాబిస్ వాక్సిన్ ఇప్పించారు. ఈ క్రమంలో పరిమితి మించి వాక్సిన్ వేయడంతో ఇలా జరిగిందని బాలిక తల్లి ఆరోపించారు.

Girl students of BC Gurukul in Keesara bitten by rats

Harish Rao Tweet

కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థులను ఎలుకలు, కుక్కలు, పాములు కరిచినా, విద్యుదాఘాతానికి గురైనా పట్టించుకోని దుస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్‌’లో విమర్శించారు. ‘గురుకుల బాట’ డొల్లతనం 24 గంటలు గడవక ముందే బయటపడిందన్నారు.