హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమని, కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామని కమిషనర్ (హైడ్రా) రంగనాథ్ తెలిపారు. అంటే జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు. గతంలో అనుమతి తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు తాము వెళ్లబోమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు మాత్రం తప్పదన్నారు. కొత్తగా అనుమతులు తీసుకుంటే హైడ్రా పరిశీలిస్తుందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పని చేస్తోందన్నారు. హైడ్రా పేదల జోలికి వెళ్లదని స్పష్టం చేశారు. పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తోందనేది తప్పుడు ప్రచారమని, అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.  మళ్లీ రంగంలోకి దిగిన హైడ్రా, ఈ సారి ఏకంగా 50 మందికి నోటీసులు...15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో వెల్లడి

Commissioner Ranganath Clears the Air on Illegal Structures

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)