Lakshmi Parvathi (Credits: Twitter)

Hyderabad, October 15: నందమూరి బాలకృష్ణ (Balakrishna) నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ 2 (Unstoppable 2)  కోసం ఇటీవల టీడీపీ (TDP) అధినేత చంద్రబాబుపై (Chandrababu) చిత్రీకరించిన ఎపిసోడ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి (Lakshmi Parvathi) మండిపడ్డారు. తాము గతంలో చేసిన దిద్దుకోని పెద్ద తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, బాలకృష్ణ ఈ షోను ఎంచుకున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడన్నది ఒట్టి బూటకమని, అదంతా ఓ నాటకమని స్పష్టం చేశారు. నాడు పార్టీలో గొడవలు చేసి రచ్చ సృష్టించింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటుపై చంద్రబాబు వివరణ ఇదీ! 27 ఏళ్ల తర్వాత నోరు విప్పిన చంద్రబాబు, బావమరిదితో కలిసి ప్రజలకు వివరణ, ఎన్టీఆర్ దగ్గరికి ఎవరెవరు వెళ్లి మాట్లాడారో తెలుసా?

అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ చూశాక బాలకృష్ణ అంటేనే ఒకరకమైన రోత పుడుతోందని, అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అత్యంత అసహ్యం, జుగుప్సా కలుగుతోందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా షోను చూస్తున్నంత సేపు అర్ధమైందని విమర్శించారు. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.