BRS MLS KTR (Photo-Video grab)

Hyd, Dec 17: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్‌ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఒకటి, రెండు రోజుల్లో ఏసీబీ కేసు నమోదు, విచారణ వంటి పరిణామాలు మరింత వేగం అందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాలపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఎలాంటి విచారణకైనా సిద్దమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకే ఈ కారు రేసింగ్ నిర్వహించామని కేటీఆర్ అన్నారు. అధికారులకు సంబంధం లేదని.. పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు. కొన్నాళ్ళు జైలులో ఉంటే ఏమవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.

అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

జైల్లో యోగా చేసుకుని ఫిట్‌గా అయివస్తానని కేటీఆర్ గతంలో అన్నారు. జైలు నుంచి వచ్చాక పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునందుకే కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇంకోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజల్లోకి తీసుకువెళతామని కారు పార్టీ నేతలు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామని.. దమ్ముంటే రెండువారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సవాల్‌ విసిరారు. మంగళవారం కొడంగల్‌ బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..కేబినెట్‌లో మాట్లాడటం కాదు. సభలో చర్చ చేద్దాం. అన్ని సమస్యలపై సభలో చర్చిద్దాం. ఈ-కార్‌ రేసు కుంభకోణంపై కూడా చర్చకు నేను రెడీ. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’’ అని సీఎం రేవంత్‌కు సవాల్‌ విసిరారు. పేరు మర్చిపోయినందుకు యాక్టర్‌ను జైలులో పెట్టించారు. సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా?అంటూ రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు.