Palnadu Horror: ఫోన్‌లో మాట్లాడుతున్న కూతురు.. అనుమానంతో డాబాపై నుంచి కిందికి తోసేసిన తండ్రి.. ఏపీలో ఘటన
కుమార్తె సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అనుమానించిన ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. ఆమెను డాబా పైనుంచి కిందికి తోసేశాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఏపీలోని పల్నాడు జిల్లా యడ్లపాడులో జరిగిందీ ఘటన.
Palnadu, Feb 11: కుమార్తె (Daughter) సెల్‌ఫోన్‌లో (Mobile) మాట్లాడుతుండడంతో అనుమానించిన ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. ఆమెను డాబా పైనుంచి కిందికి తోసేశాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఘాతుకానికి పాల్పడిన తండ్రిని పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. ఏపీలోని (AP) పల్నాడు (Palnadu) జిల్లా యడ్లపాడులో జరిగిందీ ఘటన. బాధితురాలు 16 ఏళ్ల విద్యార్థిని అని పోలీసులు తెలిపారు.
రెండు రోజుల క్రితం ఇంట్లో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూసిన తండ్రి ఆమెను మందలించాడు. దీంతో ఆమె డాబాపైకి ఎక్కి తిరిగి ఫోన్‌లో మాట్లాడడం మొదలుపెట్టింది. అది చూసిన తండ్రి ఆమె ఎవరో యువకుడితో మాట్లాడుతోందని అనుమానించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
(The above story first appeared on LatestLY on Feb 11, 2023 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

