AP Capital Issue-HC Comments: రాజధానిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్ణయం రాకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం, ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే పిటిషన్‌పై స్పందిస్తాం, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

ఏపీ రాజధానిపై (AP Capital)వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం (AP GOVT) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఈ పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

AP Capital Issue-HC Comments: రాజధానిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్ణయం రాకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం, ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే పిటిషన్‌పై స్పందిస్తాం, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు
High Court of Andhra Pradesh | (Photo-Twitter)

Amaravathi, December 31: ఏపీ రాజధానిపై (AP Capital)వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం (AP GOVT) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఈ పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కాగా రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటిని అమరావతిలోనే (Amaravathi)కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. అయితే ప్రభుత్వం ఇంకా రాజధానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే ఈ పిటిషన్లు వేయడంతో హైకోర్టు వీటిపై ఇప్పుడే విచారణ జరపలేమని చెప్పింది.

ఈ విషయంలో ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించాకే తగిన విధంగా స్పందిస్తామని, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఎన్‌ రావు కమిటీ, బోస్టస్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదికలను తమ ముందుంచాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై ఇసుక నేరుగా మీ ఇంటికే, ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జీఎన్‌ రావు (GN Rao) నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 585ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి రామారావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిటీ నివేదికను అమలు చేయకుండా చూడాలని.. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటివన్నీ అమరావతిలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రెండు అనుబంధ వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు.

మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం,విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?

జీఎన్‌ రావు కమిటీ ఏర్పాటు జీవో, తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ జీవోలో ఎక్కడా సీఆర్‌డీఏ (CRDA)చట్టం ప్రస్తావన లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపించారు. దాని ప్రస్తావన లేకుండా రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఈ చట్టంలో ఎక్కడా నిర్ణీత కాల వ్యవధిలోగా భూముల్ని అభివృద్ధి చేసి ఇవ్వాలని లేదని రైతుల భూముల్ని అభివృద్ధి చేయడం గురించి మాత్రమే ఉందని పేర్కొంది.

రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం

రైతుల భూములను అభివృద్ధి చేసి ఇవ్వడం, రాజధాని విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వేర్వేరు అంశాలని వ్యాఖ్యానించింది. భూములిచ్చిన రైతులకు వారి భూములను అభివృద్ధి చేసి ఇవ్వడమే ముఖ్యమని, మిగిలిన భూమి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను మీరెలా తప్పు పట్టగలరని ప్రశ్నించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించకుండా ఈ అంశంపై తామెలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఇంకా బీసీజీ నివేదిక రావాల్సి ఉందని ఈ దశలో ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు.

ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న జీఎన్‌ రావు కమిటీ సిఫార్సులను సమర్ధిస్తూ నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టులో అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ధర్మాసనం ఈ వ్యాజ్యాలను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది.

(The above story first appeared on LatestLY on Dec 31, 2019 12:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).