Visakha Utsav 2019-Ap CM YS Jagan ( Photo-Twitter)

Visakhapatnam, December 29: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Andhra Pradesh Chief Minister YS Jagan) బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం తొలిసారిగా విశాఖపట్టణంకు(Visakhapatnam) వెళ్లారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖలో రెండుసార్లు ఆయనకు చేదు అనుభవం ఎదురుకాగా.. ఈసారి విశాఖవాసులు పూలజల్లులతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రికి (Chief Minister)సాదరస్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. ఇక విశాఖ పర్యటన(Visakha Tour)లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన జగన్.. ఆ తరువాత విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ (Visakha Utsav 2019) కమిటీ  జగన్‌కు సన్మానం చేశారు.

సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన విశాఖ

రెండు రోజుల పాటు ఆర్‌కే బీచ్‌లో  విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా . థాంక్యూ సీఎం జగన్ (Thank you CM Jagan)అనే నినాదాలతో విశాఖ తీరం హోరెత్తిపోతోంది.బాణా సంచా మెరుపులతో ఆర్కే బీచ్ (RK beach)వెలిగిపోయింది. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి శాలువా కప్పి సీఎంను సత్కరించారు. నవరత్నా పథకాలు వివరిస్తూ లేజర్ షో ప్రదర్శించారు. విశాఖ స్థానికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

విశాఖలో మానవ హారం

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ ఉత్సవాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స, తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్సవ్‌ రెండు రోజుల పాటు జరగనుండగా ముగింపు వేడుకలకు గవర్నర్ ప్రత్యేక అతిథిగా రానున్నారు.

విశాఖలో సీఎం జగన్ చేసిన శంకుస్థాపనల వివరాలు :

రూ. 1, 290 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ (CM YS Jagan)శంకుస్థాపన చేశారు. GVMC చేపట్టనున్న రూ. 905.05 కోట్లు, VMRDA చేపట్టనున్న రూ. 379. 82 కోట్లతో విశాఖను అభివృద్ధి పథంలో నడుపుతామని తెలిపారు. లా కాలేజీ నుంచి బీచ్ రోడ్డు వరకు 80 ఫీట్ల రోడ్ విస్తరణకు రూ. 7.5 కోట్లు కేటాయించారు.

విశాఖ ఉత్సవ్‌ లో ఆకర్షణగా నిలిచిన ప్రత్యేక కార్యక్రమాలు 

చుక్కవానిపాలెంలో 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్‌కు రూ. 90 కోట్లు, కైలాసగిరి ప్లానెటోరియం ఏర్పాటు కోసం రూ. 37 కోట్లు నిధులను కేటాయించారు. సిరిపురం జంక్షన్‌లో మల్టీలెవల్ కార్ పార్కింగ్, వాణిజ్య సదుపాయం కోసం రూ. 80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రీసెర్చ్ సంస్థకు రూ. 88 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణం కోసం రూ. 75 కోట్లు కేటాయిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

నవరత్నాల show

జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీని గురించి విశాఖలో ప్రస్తావన ఏదీ చేయలేదు. అమరావతి ప్రాంత ప్రజలు ఈ ప్రకటనపై నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో సీఎం వైయస్ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ విషయంపై న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకొని.. త్వరలోనే మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన ఇచ్చే ఆవకాశం ఉందని సమాచారం.

Visakha Utsav 2019 at RK Beach

ఈ ఈవెంట్లో విశాఖ పట్నం గురించి..విశాఖ కార్యనిర్వాహక రాజదాని గురించి జగన్ మాట్లాడతారని అంతా ఊహించారు. అయితే బోస్టన్ గ్రూప్ నివేదిక ఇంకా రాలేదు. ఆ నివేదిక వచ్చిన తరువాత హైలెవల్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక వచ్చిన తరువాత మాత్రమే జగన్ రాజధాని విషయంలో మాట్లాడతారని తెలుస్తోంది. అందుకే విశాఖలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్ళిపోయి ఉంటారని తెలుస్తోంది.