Amaravthi, December 30: ఇసుకను సామాన్యలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం (AP GOVT) మరో ముందడుగు వేసింది. ఇక నుంచి ఏపీలో ఇసుక డోర్ డెలివరీ (Sand Door Delivery In AP) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2న కృష్ణా జిల్లాలో (Krishna District) పైలట్ ప్రాజెక్టు కింద అమలు జరపనుంది. జనవరి 7న తూర్పుగోదావరి, (East Godavari) వైఎస్సార్ కడప (YSR Kadapa) జిల్లాల్లో డోర్ డెలివరీ చేయనున్నారు. ఏపీలో ఇసుక రాజకీయం
జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో డోర్ డెలివరీ అమలు చేయనున్నారు. ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఈ నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. ఈ నిర్ణయం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో వినియోగదారులకు సకాలంలో ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉంది.
అమరావతి పేరు వైయస్సార్ నగరంగా పెట్టుకోమన్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ
సీఎం వైయస్ జగన్ తన క్యాంప్ ఆఫీసులో ఏపీ ఇసుక పాలసీపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు. గత ఆరు నెలల కాలంలో ఏపీవ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరత వివరాలు తెలుసుకున్నారు. ఇసుక కొరతకు కారణాలను సమీక్షించారు. ఇప్పటికే ఇసుక రీచ్‌లను గుర్తించినందున ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఇసుక డోర్ డెలివరీని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఏపీ సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు
రాష్ట్రంలోని 200 పైచిలుకు స్టాక్ యార్డుల్లో 13 చోట్ల ఇసుక వెనువెంటనే అయిపోతుందని, రవాణాఛార్జీలు తగ్గుతాయని చాలామంది ఆ 13 స్టాక్‌యార్డుల నుంచే బుక్‌చేస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్న రీచ్‌ల్లో బుకింగ్‌కు అవకాశం ఉండాలని సీఎం సూచించారు. ఆమేరకు వెబ్‌సైట్లో మార్పులు, చేర్పులకు సీఎం సూచనలు చేశారు.
మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం,విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?
ఇసుక సరఫరాకు అవాంతరాలు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. సగటున రోజుకు 80వేల టన్నులు ఇసుక విక్రయిస్తున్నామన్న అధికారులు ,సెప్టెంబరు 5 నుంచి ఇప్పటివరకూ బుక్ చేసుకున్న ఇసుక 43.7 లక్షల టన్నులు అని సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. స్టాకు యార్డుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక 9.6 లక్షల టన్నులు అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ హైకోర్టుకు చేరిన వ్యవహారం
ఇక వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రణాళికతో వ్యవహరించాలన్న సీఎం రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున తవ్వి స్టాక్ చేయాలని ఎప్పుడూ ఇసుక కొరత లేకుండా ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నాలుగు నెలల్లో నెలకు 15 లక్షల టన్నులు చొప్పున వర్షాకాలంలో పనులకోసం రిజర్వ్ చేయాలని సీఎం ఆదేశించారు. సుమారు 60లక్షల టన్నుల ఇసుకను స్టాక్ చేసుకోవాలన్న సీఎం ఈ ఏడాది ఇసుక కోసం రాష్ట్రంలో తలెత్తిన సమస్య భవిష్యత్ లో ఉండకుండా చూసుకోవాలని అన్నారు.
రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం
వచ్చే 20వ తేదీనాటికి చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఇసుక డోర్ డెలివరీ ప్రారంభం కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు . ఇప్పటికే 349 చెక్‌పోస్టుల ఏర్పాటు చేసిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చెయ్యటం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. దీంతో పాటుగా ఇక ఆయా చెక్ పోస్ట్ ల నుండి లైవ్‌స్ట్రీమింగ్ కమాండ్ కంట్రోల్ రూంకు రావాలని సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.