Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

ఈ కేసుకు సంబందించి తాజాగా భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. విజయవాడలోని సజ్జల భార్గవ్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు.. ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు.

SC,ST case registered against YSRCP Sajjala Bhargav Reddy(X)

Vijayawada, NOV 23: అధికార పార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను సమన్వయం చేస్తున్న ఆ పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి, మాజీ సీఎం జగన్‌ బంధువు అర్జున్‌ రెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబందించి తాజాగా భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. విజయవాడలోని సజ్జల భార్గవ్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు.. ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు.

MLC Jayamangala Venkataramana: వైసీపీకి మరో షాక్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన వెంకటరమణ 

పులివెందులోని అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అసభ్య పోస్టుల పెట్టిన వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌ రెడ్డి కేసులో పోలీసులు మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement