YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్‌ కానుక, 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, బయోమెట్రిక్‌ బదులుగా జియో ట్యాగింగ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ పెన్షన్‌ కానుక (YSR Pension Kanuka) పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించింది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారుల చేతికే పెన్షన్‌‌ను (social security pensions) అందిస్తున్నారు. బయోమెట్రిక్‌ బదులుగా పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్‌ (geotagging) చేస్తున్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా వాలంటీర్లు వైఎస్సార్ పెన్షన్‌ కానుకను పంపిణీ చేస్తున్నారు.

YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్‌ కానుక, 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, బయోమెట్రిక్‌ బదులుగా జియో ట్యాగింగ్‌
YSR Pension Kanuka

Amaravati, May 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ పెన్షన్‌ కానుక (YSR Pension Kanuka) పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించింది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారుల చేతికే పెన్షన్‌‌ను (social security pensions) అందిస్తున్నారు. బయోమెట్రిక్‌ బదులుగా పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్‌ (geotagging) చేస్తున్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా వాలంటీర్లు వైఎస్సార్ పెన్షన్‌ కానుకను పంపిణీ చేస్తున్నారు. ఏపీలో మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం, రాగల 24గంటల్లో అల్పపీడనం, హెచ్చరించిన వాతావరణ శాఖ కమిషనర్

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AM CM YS Jagan) నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఇందులో భాగంగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి మే నెల పెన్షన్లు అందిస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందిస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి వాలంటీర్లు ప్రతి గడప వద్దకు వెళ్లి పెన్షన్‌దారుల ఆరోగ్యంపై ఆరా తీస్తూ.. ప్రతి ఇంటిలోనూ భౌతిక దూరాన్ని పాటిస్తూ లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్లో 11 జిల్లాలు, లాక్‌డౌన్‌ ఆంక్షలపై సడలింపుల నేపథ్యంలో జాబితాను విడుదల చేసిన కేంద్రం, దేశ వ్యాప్తంగా తగ్గిన హాట్‌స్పాట్‌ జిల్లాలు

ఉదయం 10.15 గంటలకే 81శాతం పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 58.22 లక్షల మంది పెన్షన్లు అందుకోనుండగా, ఇందు కోసం ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది.పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పింఛన్ల కోసం గంటల తరబడి పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసేవారమని గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్లే తమ ఇళ్ల వద్దకు వచ్చి డబ్బులు ఇస్తున్నారని తెలిపారు.

(The above story first appeared on LatestLY on May 01, 2020 01:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).