Hyderabad, May 1: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలపై సడలింపులు (Lockdown Relaxation) ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Center) మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. రాష్టాల వారిగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు, అలాగే ఏపీలో 5 జిల్లాలను రెడ్ జోన్లుగా (Telugu States Red Zones) గుర్తించింది. 35 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం, దేశ వ్యాప్తంగా తగ్గిన రెడ్ జోన్ల సంఖ్య
అలాగే దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలను ప్రస్తుతం 129కి తగ్గించింది. 219 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. రెండు వారాల కింద ఆరెంజ్ జోన్లు సంఖ్య 207గా ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 297కు పెరిగింది. అదే విధంగా తెలంగాణలో ఆరెంజ్ జోన్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుకు గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల లిస్టును పరిశీలిస్తే..
Here's LIst
All States are accordingly requested to delineate the containment zones and buffer zones in the identified red and orange zone districts and notify the same: Union Health Secretary Preeti Sudan pic.twitter.com/Vz3f4xbs6h
— ANI (@ANI) May 1, 2020
తెలంగాణలోని రెడ్ జోన్లు
హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, వరంగల్
ఆరెంజ్ జోన్లు జాబితా
నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, అదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం,మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, భూపాలపల్లి, జనగామ, నారాయణ్‌పేట, మంచిర్యాల
తెలంగాణలో గ్రీన్ జోన్లు
పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి
కరోనా లాక్‌డౌన్ ఎత్తివేత సమయం దగ్గరపడుతుండడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ జోన్లను ప్రకటించింది. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో రెడ్ జోన్లో ఉంచింది. ఆరెంజ్ జోన్లలో పాక్షికంగా, గ్రీన్ జోన్లలో కొన్ని నిబంధనలతో పూర్తిగా పనులు చేసుకోడానికి వీలు కల్పించింది.
ఏపీ రెడ్‌జోన్లు
కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. ఆరెంజ్ జోన్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం ఉన్నాయి. ఒక్క కేసూ నమోదు కాని విజయనగరం జిల్లాను గ్రీన్ జోన్‌గా ప్రకటించారు.