Thunderbolt Warning: ఏపీలో మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం, రాగల 24గంటల్లో అల్పపీడనం, హెచ్చరించిన వాతావరణ శాఖ కమిషనర్
Representational Image (Photo Credits: PTI)

Amaravati, May 1:దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో రాగల 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి, తదుపరి 48గంటల్లో అది మరింత బలపడి, వాయుగుండంగా మారే సూచనలున్నాయని పేర్కొంది. రానున్న 49గంటల్లో ఏపీలో (Andhra Pradesh) 30-40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో 41-43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం (Thunderbolt Warning) ఉధృతంగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ గురువారం హెచ్చరించారు. దీంతో ఆయా ప్రాంతాకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కమిషనర్‌ హెచ్చారించారు. ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. చెట్ల కింద కాని, బయట ఉండకూడదని కమిషనర్‌ సూచించారు. దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం, రాగల 48 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం, వెల్లడించిన భారత వాతావరణ విభాగం

పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు

విశాఖపట్నం: నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, గోలుగొండ, కోయ్యూరు, రావికమతం, మాడుగుల, జి.మాడుగుల, బుచ్చయ్య పేట, చీడికాడ, కశింకోట

తూర్పుగోదావరి: తుని, రౌతులపూడి, కోటనందూరు, ప్రత్తిపాడు, వరరామచంద్రపురం, శంకవరం, గంగవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి

పశ్చిమగోదావరి: బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం మండలాల పరిసర ప్రాంతాలు