Amaravati, April 30: ఉత్తర సుమత్రా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.6 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంలో (south Andaman Sea) అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల కోస్తాతీరంలో ఉరుములు, మెరుపులతో మోస్తరుగా వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడడానికి అవకాశం ఉంది. 5 రోజుల్లో 142 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి, ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు, 1403కి చేరుకున్న మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
ఇది ఆగేయ దిశగా కదిలి తర్వాత ఈశాన్య దిశగా వెళ్లి మయన్మార్, బంగ్లాదేశ్ వైపు మే 1 నుంచి 3 వరకూ ప్రయాణం చేయనుంది. దీని ప్రభావం ఎపి, తెలంగాణపై తక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ (India Meteorological Department (IMD)అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు క్యుములోనింబస్ మేఘాలే కారణం.
మలక్కా జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో అల్పపీడనం (Low pressure in Andaman Sea) ఏర్పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో లాక్‌డౌన్ సడలింపు, సరికొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, పలు రంగాలకు మినహాయింపులు
శుక్రవారం గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనాల ప్రభావంతో ఏపీ రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో బుధవారం వాన లు కురిశాయి. రాష్ట్రంలోని పలుచోట్ల రెండ్రోజులు, గ్రేటర్ హైదరాబాద్‌లో నా లుగురోజులు వర్షాలు కురువొచ్చన్నారు.
నర్సీపట్నంలో 6.7, కృష్ణాపురంలో 6.6, తునిలో 5.3, కోటనందూరులో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులు వీయడంతో ఉద్యానవన తోటలకు నష్టం వాటిల్లింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి మధ్యప్రదేశ్ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు.