Amaravati, April 29: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ (India Lockdown) విధించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మే 3 తర్వాత లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అనే విషయంపై కేంద్రం నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ సడలింపునకు (AP Lockdown Relaxation) సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) అదనపు గైడ్‌లైన్స్‌ను (fresh guidelines to lockdown relaxation) విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు బుధవారం ఈ కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది. 3వ విడత ఉచిత రేషన్ ప్రారంభం, బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ది, కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి
కొత్త గైడ్‌లైన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
1.వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినహాయింపు
2.ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు మినహాయింపు
3. ఆర్థిక రంగానికి మినహాయింపు
4. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి
5. కావాల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి
6. వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి
7. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మినహాయింపు
8. వలస కార్మికులు లాక్‌డౌన్ సమయంలో ఏ జిల్లాలో ఉంటే అదే జిల్లాలో మాత్రమే పనులకు అనుమతి
9. బుక్స్ షాపు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు
10. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు
11. మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 73 కరోనా పాజిటివ్ కేసులు (AP positive cases) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. బుధవారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1332 కు చేరిందని వెల్లడించింది. తాజాగా 29 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 287కు చేరుకుంది. ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ
వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1014 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదల చేసింది.