Coronavirus outbreak in India (Photo Credits: IANS)

Amaravati, April 30: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 71 కరోనా కేసులు (AP Coronavirus Bulletin) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా కేఎస్‌ జవహర్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్‌ను పరీక్షించగా 71 మంది కరోనా నిర్ధారణ (AP Coronavirus) అయిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 321 మంది డిశ్చార్జ్‌ కాగా, 31 మంది మృతిచెందారని తెలిపారు. ఇండియాలో ఆగని కరోనా ఘోష, 33 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు, తమిళనాడులో 121మంది పిల్లలకు కరోనా పాజిటివ్

ప్రస్తుతం రాష్ట్రంలో 1051 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కొత్తగా అనంతపురం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 4, వైఎస్సార్‌ జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 43, నెల్లూరు జిల్లాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 94, 558 కరోనా పరీక్షలు నిర్వహించిన ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలించింది. కాగా, ఏపీలో గత ఐదు రోజులుగా మరణాలు నమోదు కాలేదు. అలాగే ఇన్ఫ్‌క్షన్‌తోపాటుగా, మరణాల రేటు కూడా తగ్గింది. 11 జిల్లాలు కరోనా రహితం, తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్, మే 8 నాటికి కరోనారహిత రాష్ట్రం, ఆశాభావం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం వల్ల కంగారు పడక్కర్లేదని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, అయితే కేసుల సంఖ్య ముఖ్యం కాదని, ఇన్ఫెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి వారిని.. ఆస్పత్రిలో వైద్యం అందిస్తే మిగతా వారికి వైరస్‌ సోకకుండా కాపాడుకోగలమని అన్నారు. 2020లోనే ఆరు ప్రాజెక్టులు ప్రారంభం, పోలవరం సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎంకు తెలిపిన అధికారులు, పనులు వేగవంతం చేయాలన్న వైయస్ జగన్

గడిచిన నాలుగు రోజులుగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. మరోవైపు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన అయిదు రోజుల్లో 142 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 287 మంది డిశ్చార్జి అయినట్లు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో అయిదు రోజుల క్రితం 15.1 శాతంగా ఉన్న రికవరీ రేటు ఇప్పుడు 21.54 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 31గా ఉంది. ఏపీలో లాక్‌డౌన్ సడలింపు‌, సరికొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, పలు రంగాలకు మినహాయింపులు

ఏపీలో సగటున పది లక్షల జనాభాకు చేస్తున్న కరోనా టెస్టుల సం ఖ్య 1,649కి చేరింది. గడిచిన కొన్ని రోజు లుగా దేశంలోనే ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందంజలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాటికి రాష్ట్రంలో 88,061 టెస్టులు చేశారు. ఇప్పటి వరకు 1332 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పాజిటివ్‌ రేటు 1.51 శాతం మాత్రమే ఉంది.

దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 7,70,764 టెస్టులు చేశారు. దేశంలో పాజిటివ్‌ కేసుల శాతం 3.84గా ఉంది. మృతుల శాతం దేశీయ సగటు 3.84గా ఉంటే, ఏపీలో 2.33 శాతం ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర వంటి రాష్ట్రాల కంటే మరణాల నియంత్రణలో ఏపీ ముందంజలో ఉంది.