New Dlehi, April 30: భారత్‌లో కరోనా వైరస్ కేసులు (India Coronavirus Bulletin)పెరుగుతున్నాయో కాని తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 67 మంది ప్రాణాలు కోల్పోగా, 1,718 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) 33,050కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,074 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 8,325 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మే 4 నుంచి లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమలు, మరిన్ని సడలింపులు లభించే చాన్స్, సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కూలీలు, విద్యార్థులకు ఇప్పటికే అనుమతి
మహారాష్ట్రలో 432, గుజరాత్‌లో 197, ఢిల్లీలో 56, మధ్యప్రదేశ్‌లో 130, రాజస్థాన్‌లో 57, తమిళనాడులో 27, ఉత్తరప్రదేశ్‌లో 39, ఆంధ్రప్రదేశ్‌లో 31, తెలంగాణలో 25, వెస్ట్ బెంగాల్‌లో 22, జమ్మూకశ్మీర్‌లో 8, కర్ణాటకలో 21, కేరళలో 4, బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున, పంజాబ్‌లో 19, హర్యానాలో, జార్ఖండ్‌లో ముగ్గురు చొప్పున, ఒడిశా, అసోం, మేఘాలయలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు.
ఆగ్రాలో ఇప్పటివరకు కొత్తగా 22 కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో ఆగ్రాలో మొత్తం కేసుల సంఖ్య 455కు చేరుకుంది. మొత్తం కేసుల్లో 353 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ఆగ్రా డీఎం ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. మరోవైపు లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఆగ్రాలోని చారిత్రాక ప్రదేశమైన తాజ్‌మహల్ పరిసరాలు, ఇతర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఐసోలేషన్ నుండి పరార్, కరోనాతో 17 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరిన వృద్ధుడు, ఫ్యామిలీ అంతా క్వారంటైన్‌లోకి, పుణేలో ఘటన
మహారాష్ట్రలో కరోనా (COVID 19) పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలకు చేరువయ్యింది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటే.. మహారాష్ట్రలో జిల్లాల వారీగా చూసినప్పుడు మాత్రం పుణేలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ బుధవారం సాయంత్రానికే కేసుల సంఖ్య 1,595కు చేరగా.. గత 12 గంటల్లో మరో 127 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పుణే జిల్లాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1722కు చేరింది. కాగా, జిల్లాలో ఒక్కరాత్రిలోనే 100కు పైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోందని పుణే జిల్లా ఆరోగ్య అధికారి భగవాన్ పవార్ పేర్కొన్నారు.
తమిళనాడు రాష్ట్రంలో 12 ఏళ్ల వయసు లోపు 121 మంది పిల్లలకు కొవిడ్-19 సోకిందని తాజాగా తేలింది. తమిళనాడు రాష్ట్రంలో 2,058 కరోనా కేసులు వెలుగుచూడగా, ఇందులో 121 మంది పిల్లలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 1392 మంది పురుషులు, 666 మంది మహిళలు కరోనా బారిన పడ్డారు. చెన్నై నగరంలో గత 24 గంటల్లోనే 103 కరోనా కేసులు వెలుగుచూశాయ. చెన్నై నగరంలో అత్యధికంగా 673 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. తమిళనాడులో 1128 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. తమిళనాడులో కరోనా మృతుల సంఖ్య 25కు పెరిగింది. రాష్ట్రంలో ఒక్క కృష్ణగిరి జిల్లా తప్ప అన్ని జిల్లాలో కరోనా కేసులు వెలుగుచూశాయి. పిల్లలకు కరోనా సోకడంతో వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
ఢిల్లీలో ఏప్రిల్ 29 వరకు మొత్తం కరోనావైరస్ కేసులు 3,439 కు పెరిగాయి. గుజరాత్లో అహ్మదాబాద్‌లో బుధవారం కొత్తగా 234 కోవిడ్ -19 కేసులతో కోవిడ్ -19 సంఖ్య 2,777 కు చేరుకుంది.