Amaravati, April 29: పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా గట్టిగానే అడుగులు వేస్తున్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పనులపై (Polavaram Project Works) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. 3వ విడత ఉచిత రేషన్ ప్రారంభం, బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ది, కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి
ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు కూడా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ
ఈ సమావేశంలో పోలవరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ప్రాధాన్యతగా తీసుకున్న అవుకు టన్నెల్ 2, వలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులపైనా కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తికావాలన్నారు. 2020లోనే ఈ 6 ప్రాజెక్టులు తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారులు సీఎం జగన్‌మోహన్ రెడ్డికి హామీ ఇచ్చారు. బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు రద్దు, ఏపీలో తాజాగా 73 కరోనా కేసులు, మొత్తంగా 1014 యాక్టివ్ కేసులు, రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు
Here's CMO Andhra Pradesh Tweet
పోలవరం పనులపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. సిమెంటు, స్టీల్ సరఫరా ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశం. స్పిల్‌వే జూన్ నెలాఖరు పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం. pic.twitter.com/4G8y58Xf5b
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 29, 2020
ప్రాజెక్టు పనులకు సంబంధించి సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని ఏపీ సీఎం సూచించారు. ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు. గత సంవత్సరం గోదావరి వరదల్లో ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్ని శరవేగంతో తరలించాలని, వారికి పునరావాస కార్యక్రమాలు వేగంగా చేపట్టాలని అధికారులను ఏపీ సీఎం ఆదేశించారు. 7797 మందికి కోవిడ్-19 నుండి విముక్తి, ఇండియాలో 22,982 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనావైరస్ కేసులు
కాగా కరోనావైరస్ నేపథ్యంలో సిమెంటు, స్టీల్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల
ఈ నేపథ్యంలో సిమెంటు, స్టీల్ సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రిని ఆదేశారు. స్పిల్‌వే జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు.