Jagananna Vidya Deevena: విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల
Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, April 28: విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పలు పథకాలు ప్రవేశపెడుతున్న ఏపీ సీఎం జగన్ (ap cm ys jagan mohan reddy) మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి (Jagananna Amma Vodi), జగనన్న వసతి దీవెన (Jagananna Vasathi Deevena) పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కారు (AP Govt) నేడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించింది. దీన్ని క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను (Fee reimbursement) ఒకేసారి అందజేయనున్నారు. జగనన్న విద్యా దీవెనకు అర్హతలు ఏంటీ?, కుటుంబ వార్షికాదాయం ఎంత ఉండాలి

‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని వరుసపెట్టి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజును రీయింబర్స్‌ చేసే పథకం ప్రవేశపెడుతున్నారు.నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా

పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం ఈ పథకాన్ని (Jagananna Vidya Deevena) ప్రవేశపెడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం (TDP Govt) బకాయి పెట్టిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించడంతో పాటు, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు

Here's CMO Andhra Pradesh Tweet

కాగా 2018–19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.1,880 కోట్లను టీడీపీ సర్కారు చెల్లించలేదు. ఆ బకాయిలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది. అలాగే, 2019–20 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ రెండేళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.4వేల కోట్లు విడుదల చేసింది. పేదలకు భరోసానిచ్చే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా

2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించి ఉంటే ఆ మొత్తం ఏప్రిల్‌ నెలాఖరులోగా తిరిగి ఇచ్చేసేందుకు కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. 2018–19, 2019–20లో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఏమైనా కట్టి ఉంటే ఆ సొమ్మును కూడా తిరిగి రాబట్టుకోవాలని తెలిపింది. నాడు వైఎస్సార్‌..నేడు వైఎస్‌ జగన్‌

రానున్న విద్యా సంవత్సరం 2020–21లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా (నాలుగు త్రైమాసికాలకు) డబ్బు వేయనున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఇంటి గడపకు పాలనే లక్ష్యంగా వైఎస్‌ఆర్ నవశకం

ఇలా కాలేజీలకు వెళ్లడం, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక వసతి దీవెన కింద ఏటా రూ.20వేల వరకు తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఎంఎస్‌ఎంఈలకు రక్ష వైయస్సార్ నవోదయం

రూ. 560 కోట్లతో వైయస్సార్ 'కంటి వెలుగు' స్కీమ్

చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు

వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ ప్రారంభం, ఆర్థిక భద్రత కోసం ఏటా రూ.10 వేలు

కాపుల నేస్తంగా సీఎం జగన్ పథకం

ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?