AP government frames guidelines for ‘Jagananna Vidya Deevena’ and ‘Vasathi Deevena’ schemes (Photo-Twitter)

Amaravathi, December 1: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), జగనన్న వసతి దీవెన (Jagananna vasathi deevena)పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Government of Andhra Pradesh) శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ మేరకు జగన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్‌మెంట్(students will get complete fee reimbursement ) చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకు జగనన్న విద్యా దీవెన వర్తిస్తుంది. ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని ఉన్నత విద్యలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ (fee reimbursement)అమలు కానున్నది.

జగనన్న వసతి దీవెన పథకం కింద పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనున్నది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐకి రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు అందుతాయి. డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు వసతి దీవెన సహాయం లభించనుంది. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు లోపు ఉన్న పేద కుటుంబలందరికి ఈ పథకం వర్తింస్తుంది. అర్హులయిన విద్యార్థుల ఎంపిక చేపట్టాలని సంబంధింత శాఖలను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

CMO Andhra Pradesh Tweet

అన్ని సామాజిక వర్గాలకు ఎలాంటి మినహాయింపులు లేకుండా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసేలా, ఇందుకు ఆదాయ పరిమితిని అన్ని వర్గాలకు సమం చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇందులో భాగంగా ఫీజు రీయింబర్సుమెంట్ కోసం జగనన్న విద్యా దీవెన పేరుతో రూ.3,400 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్ కోసం రూ.1800 కోట్లు మాత్రమే వెచ్చించింది.

హాస్టల్స్‌లో మెరుగైన సౌకర్యాల కోసం జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన కింద ఏడాదికి రూ.5,700 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ వర్గాల వారికి, దివ్యాంగులకు విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్సుమెంట్ సౌకర్యం అందుబాటులో ఉంది.

బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే, బీఈడీ వంటి కోర్సులకు కూడా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్సుమెంట్స్ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు కాలేజీలు, యూనివర్సిటీలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పథకం వర్తిస్తుంది.

పది ఎకరాల లోపు మాగాణి లేదా 25 ఎకరాల లోపు మెట్ట ఉన్న వారికి లేదా ఈ రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వర్తిస్తాయి. పట్టణాల్లో 1500 చ.అ. లోపు స్థిరాస్థి ఉన్న వారికి, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.

ట్యాక్సీ, ఆటో, ట్రాక్డర్ నడుపుతూ జీవిస్తున్న కుటుంబాల వారికి ఆదాయ పరిమితి నిబంధన మినహాయింపు.హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏటా రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏటా రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు చదివే వారికి ఏటా రూ.20 వేలును అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మొత్తాన్ని ప్రతి ఏటా జూన్ నెలలో 50 శాతం చెల్లిస్తారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో మిగతా 50 శాతం చెల్లింపులు చేస్తారు. ఈ మొత్తాన్ని కూడా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేస్తారు. ఈ పథకానికి ఏటా రూ.2300 కేటాయించింది. కాగా గత ప్రభుత్వం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది.

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన స్కీంల కింద ఇప్పటి వరకు లబ్ధిదారుల సంఖ్య 11,44,490 మంది ఉన్నారని అంచనా. ఇక ఈ రెండు పథకాలకు ప్రస్తుతానికి రూ.5,700 కోట్లు అవసరమవుతాయి. నిబంధనల సడలింపుతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.