AP CM Chandrababu Delhi Tour Updates, babu Meets Amit Shah And Niramala Sitharaman(X)

Delhi, Aug 18:  టీడీపీ చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి పనులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్‌లను కలిశారు చంద్రబాబు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అలాగే ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పిన విధంగా సాయం అందించాలని కోరారు.

తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రితో సుమారు గంటన్నర పాటు సమావేశం అయ్యారు చంద్రబాబు. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

ఇవాళ కూడా ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని, రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు చంద్రబాబు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు - మోడీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏపీలో 15 శాఖల్లో బదిలీలు, గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం, 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి

హస్తిన పర్యటనలో భాగంగా రాజధాని ప్రాజెక్టులను చేపట్టేందుకు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం నిధులు ఇవ్వాలని కోరారు చంద్రబాబు. ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందని మరోసారి మోడీకి తెలిపారు చంద్రబాబు. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కీలకంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.