Amaravathi, January 10: ఏపీలో పరిపాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్ (CM Jagan) మరో రెండు కొత్త (Two New Schemes)శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెబుతున్నారు. ఇందులో భాగంగా ‘జగనన్న విద్యా దీవెన’,(Jagananna Vidya Deevena) ‘జగనన్న వసతి దీవెన’ (Jagananna Vasathi Deevena) అనే రెండు కొత్త పథకాలను తీసుకొస్తున్నారు.
చిత్తూరులో గురువారం(జనవరి 9,2020) జగనన్న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ ఈ రెండు పథకాల గురించి మాట్లాడుతూ.. ''జగనన్న వసతి దీవెన'' స్కీమ్ కింద డిగ్రీ విద్యార్థుల చదువు, హాస్టల్, భోజన ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. ఈ మొతాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలలో రూ.10వేలు.. జూలై, ఆగస్టు నెలలో రూ.10వేలు జమ చేస్తామన్నారు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదని ఏపీ సీఎం అన్నారు.
విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద డిగ్రీ చదివే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొస్తామన్నారు.
జగనన్న విద్యా దీవెన పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి
ఇంటర్ మీడియట్ అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీ చేస్తున్న వారు కేవలం 23 శాతమే ఉన్నారని, 77 శాతం మంది పిల్లలు చదువల జోలికి వెళ్లడం లేదని వివరించారు.
జగనన్న విద్యా దీవెనకు అర్హతలు ఏంటీ?, కుటుంబ వార్షికాదాయం ఎంత ఉండాలి
చదువులు భారమై..చదివించలేని పరిస్థితి తల్లిదండ్రులకు వచ్చిందని, స్టడీ చేదామని అనుకున్నా అలాంటి పరిస్థితి లేదని సభలో తెలిపారు.
అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ
ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదరికంలో ఉన్న మైనార్టీలు, అగ్రవర్ణ పేదలున్నారని, వీరి జీవితాలను బాగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తామన్నారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తోడుగా ఉంటామని ప్రకటించారు.
ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు
అమ్మ ఒడి స్కీమ్ కింద 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాలో ఏటా రూ.15వేలు వేయనున్నారు. దేశ చరిత్రలో అమ్మఒడి లాంటి స్కీమ్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం జగన్ చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం తీసుకురాలేదన్నారు.
సంక్రాంతి సెలవుల తేదీలు వచ్చేశాయి
పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశ పెడతామన్నారు. తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా ఉంటుందన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని జగన్ చెప్పారు. తెలుగు మీడియం కచ్చితంగా కావాలనే పెద్ద సినిమా స్టార్ సహా నేతలెవరూ వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించరని సీఎం జగన్ విమర్శించారు.