AP Capital Political Row (photo-File-Twitter)

Amaravathi, January 07: ఏపీలో ఇప్పుడు రాజధానిపై యుద్ధం(AP Capital War) నడుస్తోంది. 3 రాజధానుల ఉండవచ్చంటూ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) చేసిన ప్రకటనను టీడీపీ(TDP) పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో(Amaravathi) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధానిని (AP Capital Change)ఇక్కడ నుంచి తరలిస్తే ఊరుకునేది లేదంటూ అమరావతికి భూములిచ్చిన రైతులు అక్కడ నిరసన (Farmers protest) కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి రాజధానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇందుకోసం హైవపర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.

ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు

ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున హైపవర్ కమిటీ తమ నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికపై కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం. ప్రకటన రాక ముందే అమరావతిలో రైతులు, దీక్షలు, నిరసనలు చేస్తున్నారు.

విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రైతులు దాడి

ఈ నిరసనల్లో భాగంగానే మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై(innelli Ramakrishna Reddy) కొందరు దాడి చేశారు. రాళ్లతో కారుపై దాడి చేసి . కారు అద్దాలు ధ్వంసం ధ్వసం చేశారు. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బందిపైనా చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు నినాదాలు చేశారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎమ్మెల్యే కారు మరో కారుని ఢీకొట్టింది. చివరికి.. ధ్వంసమైన కారులోనే ఎమ్మెల్యే పిన్నెల్లి వెనుదిరిగారు.

సంక్రాంతి సెలవుల తేదీలు వచ్చేశాయి

తెరముందుకు వచ్చి మాతో మాట్లాడు: బాబుకు పిన్నెల్లి సవాల్

తనపై దాడి జరిగిన తర్వాత పిన్నెల్లి విలేకరులతో మాట్లాడుతూ.. ఏదో రకంగా మమ్మల్ని భయపెట్టటానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూ తనకు అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గుండాగిరీకి పాల్పడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. రాజధాని రైతుల ముసుగులో చంద్రబాబు చేస్తున్న దురాగతాలను ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా 

చంద్రబాబు నాయుడు మూలంగానే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు . అమరావతి కోసం అతను ఎందుకు వయెలెన్స్ సృష్టిస్తున్నాడు? అక్కడ ఏమీ లేదు. అమరావతిని అభివృద్ధి చేయడానికి రూ .1.1 లక్షల కోట్లు అవసరమని ఆయనే స్వయంగా చెప్పారు. మన ఆర్థిక పరిస్థితి రూ .11.1 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి అనుమతిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పిన్నెల్లిపై జరిగిన దాడిని ఖండించారు.

Here'S ANI Tweet

ఏపీకి 3 రాజధానుల అవసరం ఉంది, బహుశా 3 రాజధానులు వస్తాయేమోనన్న ఏపీ సీఎం వైయస్ జగన్

"మా గన్ మెన్ ను కొట్టారు...మా గన్ మెన్ కు దెబ్బలు తగిలాయి...అక్కడ ఉన్నవాళ్లు అంతా తాగి ఉన్నారు..నా కారు డ్యామెజి చేస్తే సమస్య పరిష్కారం కాదు కదా...ఫ్రీ ప్లాన్డ్ గా చంద్రబాబు రాజధాని రైతులు ముసుగులో కొందరిని రెచ్చగొడుతున్నాడు అని పిన్నెల్లి అన్నారు. మావను వెన్నుపోటు పొడిచి అధికారంలోకివచ్చిన చంద్రబాబు నాయుడు, తెరచాటు రాజకీయాలు కాక తెరముందుకు వచ్చి మాతో మాట్లాడాలని సవాల్ విసిరారు.

దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా, చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని

నారా లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో 24 గంటల రిలే నిరాహారదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షాస్థలికి లోకేశ్ వెళ్లారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన అక్కడి నుంచి బయల్దేరారు. తిరిగి వస్తున్న సమయంలో కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే రామానాయుడును, మరో ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేశారు.

రాజధానిపై రిపోర్ట్ వచ్చేసింది, సీఎం వైయస్ జగన్‌కు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ

ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్

అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు న్యాయం చెయ్యాలని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. లాఠీలతో ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం జగన్ నిరంకుశత్వానికి నిదర్శనం అని విమర్శించారు. వైసీపీ సర్కారు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదంటోందని, కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల తరఫున టీడీపీ పోరాటం ఆగదని లోకేశ్ స్పష్టం చేశారు.

అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ

అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించవద్దని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. నాడు కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చించకుండానే అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు. గెజిట్ లేదా జీవో ద్వారా అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని ఈ లేఖలో కోరారు.

తెరపైకి 25 జిల్లాలను తీసుకువచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి

భారతదేశ చిత్ర పటంలో అమరావతిని రాజధానిగా గుర్తించారు కనుక మ్యాప్ లో కూడా మార్పులు చేయాలని కోరారు. రాజధానిగా అమరావతి నోటిఫై కాకుండానే అక్కడి నుంచి నాడు బాబు పాలన సాగించారని విమర్శించారు. అమరావతి రాష్ట్రానికి మధ్యస్థంగా ఉంటుందన్న వాదన సరికాదన్న విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు.

తెరపైకి రాజధానిగా తిరుపతిని తీసుకువచ్చిన చింతా మోహన్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దని కొందరు వాదిస్తున్నారని, అలాంటివారిలో రాష్ట్ర ప్రజలకు జరిగే మేలుకన్నా చంద్రబాబు సేవలో తరించాలన్న తాపత్రయం కనిపిస్తోందని ఆరోపించారు. రాజకీయాల్లో పైసాకు కొరగాని వాళ్లు కూడా రంకెలు వేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబుకు భజన చేయాలనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ రాజధాని అంశంలో అవగాహన లేకుండా మాట్లాడొద్దని హితవు పలికారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అమరావతి పేరు వైయస్సార్ నగరంగా పెట్టుకోమన్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ

హైవేను దిగ్బంధించిన రైతులు

అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనల్లో భాగంగా చినకాకాని వద్ద హైవేను దిగ్బంధించిన విషయం తెలిసిందే. రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. అంతకు ముందు హైవేపై ఉన్న వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెబుతూ లాఠీఛార్జీ చేస్తుండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంచలన విషయాలను బయటపెట్టిన జీఎన్ రావు కమిటీ

రాజధాని హైపవర్ కమిటీకి రాయలసీమ నేతలు లేఖ

రాజధాని హైపవర్ కమిటీకి ఈ రోజు రాయలసీమ నేతలు ఓ లేఖ రాసి తమ అభిప్రాయాలను తెలిపారు. ఆ లేఖపై గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్‌, చెంగారెడ్డి సంతకాలు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కమిటీలు ఇచ్చిన నివేదికలు సీఎం జగన్ ఆలోచనకు తగ్గట్లే ఉన్నాయని వారు అందులో పేర్కొన్నారు.

ఏపీ రాజధాని అంశం:ఇప్పటి వరకు నాయకులు ఏమన్నారో వారి మాటల్లో...

రాయలసీమ ప్రాంత వాసులు తెలుగు జాతి కోసం ఎన్నో త్యాగాలు చేశారని రాయలసీమ నేతలు లేఖలో తెలిపారు. తమ త్యాగాలు, మనోభావాలు జీఎన్ రావు, బోస్టన్ కమిటీ ప్రతినిధులకు తెలియవని వారు అన్నారు. గ్రేటర్ రాయలసీమలో రాజధానిని పునరుద్ధరించాలని వారు పేర్కొన్నారు.

ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ఖాయమని వెల్లడించారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వెల్లడించారు.రాజధాని అమరావతి కోసం జైలుకైనా వెళ్తానని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు తీహారు జైలుకెళ్లినా విశాఖపట్నంలో రాజధానిని పెట్టడం మాత్రం ఆగదని స్పీకర్‌ స్పష్టం చేశారు.తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎక్కడ పడిపోతుందనే భయంతో చంద్రబాబు, టీడీపీ నాయకులు మూడు రాజధానులపై రాద్ధాంతం చేస్తున్నారని, అంతే తప్ప అమరావతిపై ప్రేమతో కాదని అన్నారు.