Festival Holidays Dates In AP: సెలవుల తేదీలు వచ్చేశాయి, సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ, ఈ నెల 10 నుంచి సంక్రాంతి సెలవులు
AP government has announced Christmas, Sankranti holidays dates | Wikimedia Commons

Amaravathi, December 14: పెద్దలు పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి (Sankranti) రానే వచ్చేస్తోంది. సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో అందరూ ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. కాగా ఆ పెద్ద సంక్రాంతి పండగకు ముందు క్రిస్మస్ (Christmas) పండగ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు (Sankranti and Christmas Holidays) సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై రాష్ట్ర విద్యాశాఖ(AP School Education Department) ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటన మేరకు ఈనెల 24వ తేదీ నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి ఒకటితో క్రిస్మస్ సెలవులు ముగుస్తాయి. జనవరి 10వ తేదీన సంక్రాంతి సెలవులు మొదలై 20వ తేదీతో ముగుస్తాయి. అదేవిధంగా ఇంటర్ బోర్డు తన వార్షిక ప్రణాళికలో జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. దాదాపు 10 రోజుల పాటు సెలవులు రావడంతో పిల్లలు అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.